High Cholesterol : ఐ కొలెస్ట్రాల్ ఉన్నవారు ఉదయాన్నే ఏం తినాలో తెలుసా…?కచ్చితంగా తెలుసుకోండి…

High Cholesterol : ప్రతిరోజు మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న జీవన శైలి ఆధారంగా చూసుకున్నట్లయితే ఎక్కువమందిలో చెడు కొలస్ట్రాల్ అధికంగా కనిపిస్తుంది. ఇక ఈ సమస్య ఎక్కువైతే మాత్రం ప్రమాదగంటికలు మోగించక తప్పదు. మరి అలాంటివారు ఎలాంటి ఆహారం తీసుకోవడం మంచిదో ఇప్పుడు మనంం తెలుసుకుందాం. అయితే మారుతున్న జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లు వలన చాలామందిలో బ్యాడ్ […]

  • Published On:
High Cholesterol : ఐ కొలెస్ట్రాల్ ఉన్నవారు ఉదయాన్నే ఏం తినాలో తెలుసా…?కచ్చితంగా తెలుసుకోండి…

High Cholesterol : ప్రతిరోజు మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న జీవన శైలి ఆధారంగా చూసుకున్నట్లయితే ఎక్కువమందిలో చెడు కొలస్ట్రాల్ అధికంగా కనిపిస్తుంది. ఇక ఈ సమస్య ఎక్కువైతే మాత్రం ప్రమాదగంటికలు మోగించక తప్పదు. మరి అలాంటివారు ఎలాంటి ఆహారం తీసుకోవడం మంచిదో ఇప్పుడు మనంం తెలుసుకుందాం. అయితే మారుతున్న జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లు వలన చాలామందిలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అలాగే శరీరంలో ఈ కొలెస్ట్రాల్ అధిక మొత్తంలో పేరుకుపోవడం వలన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే హై కొలెస్ట్రాల్ ఉన్నవారు వీలైనంత త్వరగా వారి యొక్క ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రతిరోజు ఉదయం తప్పకుండా మంచి ఆహారం తీసుకోవాలని లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే హై కొలెస్ట్రాల్ ఉన్నవారు ప్రతిరోజు ఉదయం తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కూరగాయలు ఫ్రూట్స్….

do-you-know-what-people-with-high-cholesterol-should-eat-in-the-morning

ప్రతిరోజు ఉదయాన్నే పీచుతో కూడిన పండ్లు కూరగాయలను ఎక్కువగా తినడం వలన హై కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అంతేకాక ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆపిల్ ద్రాక్ష సిట్రస్ వంటి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చక్కర స్థాయిలను తగ్గిస్తాయి. కావున ఉదయం పూట ఫ్రూట్స్ మరియు కూరగాయలు తినడం చాలా మంచిది.

కోడిగుడ్డు..

do-you-know-what-people-with-high-cholesterol-should-eat-in-the-morning

హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గుడ్డు తినడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఉదయం పూట కోడిగుడ్డులోని పచ్చ సున్న తీసేసి మిగిలిన తెల్లటి భాగాన్ని మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్డు యొక్క పచ్చసొనలో కొలెస్ట్రాల్ శాతం అధికంగా ఉంటుంది. అందుకే దానిని తినకుండా తెల్లటి భాగాన్ని తినడం ఆరోగ్యానికి మంచిది.

తినకూడనివి…

అయితే ఉదయం పూట నూనె పదార్థాలను ఫాస్ట్ ఫుడ్లను అస్సలు తినకూడదు. హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ఇలాంటి ఆహారాలు తింటే మరింత బాధపడక తప్పదు. వీటిలో అధిక మొత్తంలో కొవ్వు ఉండటం వలన మరిన్ని ఇబ్బందులకు గురవుతారు. కావున వీటిని తినడం తక్షణమే మానేయడం మంచిది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.