Health Care : పడుకునే ముందు ఫోన్ పక్కన పెట్టుకుంటున్నారా..?అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి…
Health Care : నేటి కాలంలో మొబైల్ అనేది మనసులకు ఎంతగా అలవాటు పడిపోయిందో మాటల్లో చెప్పాల్సిన పనిలేదు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఫోన్ ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది ఫోన్ కు బానిసలు అవుతున్నారని చెప్పాలి. దీనికి విపరీతంగా అలవాటు పడిపోవడంతో రాత్రి కూడా మొబైల్ చూస్తూనే చాలామంది నిద్రిస్తున్నారు. అలాగే ఫోన్ ను బెడ్ పై లేదా దిండు కింద పెట్టుకొని పడుకుంటున్నారు. కానీ ఇలా చేస్తే […]
Health Care : నేటి కాలంలో మొబైల్ అనేది మనసులకు ఎంతగా అలవాటు పడిపోయిందో మాటల్లో చెప్పాల్సిన పనిలేదు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఫోన్ ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది ఫోన్ కు బానిసలు అవుతున్నారని చెప్పాలి. దీనికి విపరీతంగా అలవాటు పడిపోవడంతో రాత్రి కూడా మొబైల్ చూస్తూనే చాలామంది నిద్రిస్తున్నారు. అలాగే ఫోన్ ను బెడ్ పై లేదా దిండు కింద పెట్టుకొని పడుకుంటున్నారు. కానీ ఇలా చేస్తే ఏం జరుగుతుందనేది ఎవరికైనా తెలుసా..? అసలు నిజం తెలిస్తే మరోసారి ఇలా అస్సలు చేయరు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొబైల్ ఫోన్ ఉపయోగించడం వలన ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది దీనిని సరైన దిశగా వినియోగించడం లేదు. అంతేకాక విపరీతంగా దీనిని ఉపయోగిస్తూ రోగాలను తెచ్చుకుంటున్నారు. మరి ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువగా ఫోన్ తో గడిపేవారు అలాగే ఫోన్ చూస్తూ నిద్రిస్తున్నారు. ఇలా నిద్రించే ముందు మొబైల్ చూడడం వలన నిద్ర భంగం ఏర్పడుతుంది. అలాగే ఫోన్ దగ్గర పెట్టుకుని నిదురించటం వలన ఫోన్ యొక్క రేడియేషన్ శరీరంపై ప్రభావితం చూపిస్తుంది.తద్వారా మెదడు సమస్యలు వంటివి వస్తాయి.
ఈ నేపథ్యంలోని ఇటీవల యాపిల్ ఫోన్ తన కస్టమర్లకు కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేయడంం జరిగింది. మొబైల్స్ ను దిండు కింద, దుప్పట్లపై లేదా గాలి వెలుతురు లేని చోట అసలు ఉంచకూడదట. ఇక నిద్రించే సమయంలో కూడా ఫోన్ పక్కనే ఉంటే మానసిక సామర్థ్యం తగ్గుతుందట . వైద్య నిపుణులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఫోన్ పక్కన పెట్టుకొని పడుకోవటం ద్వారా రేడియేషన్ కు గురై దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పడుకునే ముందు ఫోన్ కనీసం 3 అడుగుల దూరం పెట్టుకోవడం మంచిది. కావున నిద్రించే సమయంలో వీలైనంత దూరంగా ఫోన్ ఉంచటం మంచిది.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.