Ambedkar Statue : ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్…

Ambedkar Statue : ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు .. స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి 127 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు . ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమత సంకల్ప సభ స్వరాజ్ మైదానం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అయితే ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం […]

  • Published On:
Ambedkar Statue : ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్…

Ambedkar Statue : ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు .. స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి 127 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు . ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమత సంకల్ప సభ స్వరాజ్ మైదానం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అయితే ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకుంటారు. అనంతరం అక్కడ ఉండి జరగనున్న సామాజిక సమాత సంకల్ప సభలో జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రసంగం ముగిసిన అనంతరం అక్కడినుండి స్వరాజ్ మైదానం చేరుకుని బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జగన్ పాల్గొనబోతున్నారు. ఇక ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం జగన్ తిరిగి తాడేపల్లి నివాసానికి బయలుదేరుతారు.

అయితే దేశ పాలన మార్గదర్శకాల విధాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన అందించిన సేవలకు గౌరవంగా ఈరోజు సీఎం జగన్ 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఆవిష్కరించిననున్నారు. అయితే స్వరాజ్య మైదానంలో విగ్రహ పీఠంతో పాటు కలిపి అంబేద్కర్ విగ్రహం ఎత్తు దాదాపు 206 అడుగులు. అయితే మన భారతదేశంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాలన్నింటిలోకి ఇదే అత్యంత ఎత్తైన విగ్రహంగా ప్రఖ్యాతిగాంచాల్నంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ జగన్ చిత్తశుద్ధితో విజయవాడ నగరం నడిబొడ్డున కొన్ని వందల కోట్ల విలువైన స్థలంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి అత్యంత ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చి విగ్రహ నిర్మాణ పనులను దగ్గరుండి చూసుకుంటూ పూర్తిచేయడం అందరి పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పాలి.

అంతేకాక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యత ప్రణాళికలను పాటిస్తూ అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పూర్తి చేశారు. ఇక ఈ అంబేద్కర్ విగ్రహం కింద భాగంలో గ్రౌండ్ ఫ్లోర్ , ఫస్ట్ ఫ్లోర్ మరియు సెకండ్ ఫ్లోర్ లు కూడా ఉన్నాయి. ఇక గ్రౌండ్ ఫ్లోర్ లో 4 హల్స్ ఉండగా దానిలో ఒక్కొక్కటి నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. ఇక దీనిలో సినిమా హాల్ తో పాటు అంబేద్కర్ చరిత్రను తెలియజేసే డిజిటల్ మ్యూజియాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రపంచ పర్యాటకులను సైతం ఆకర్షించేలా విగ్రహ ఆవిష్కరణతో పాటు స్మృతివనంలో ఏర్పాటుచేసిన గార్డెనింగ్ మరియు అంబేద్కర్ చరిత్రను తెలియజేసే మ్యూజియం , గ్రంథాలయం మ్యూజికల్ ఫౌంటెన్ వంటివి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.