Nara Lokesh : నారా లోకేష్ కు సిఐడి నోటీసులు…ఢిల్లీకి వెళ్లి మరి…

Nara Lokesh  : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం జరిగింది. దీంతో చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అంటూ టిడిపి అధినేతలు మరియు చంద్రబాబు అభిమానులు నిరసనలు చేపట్టారు. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అయితే తాజాగా నారా లోకేష్ అరెస్ట్ వార్త వైరల్ గా మారింది. అమరావతి […]

  • Published On:
Nara Lokesh : నారా లోకేష్ కు సిఐడి నోటీసులు…ఢిల్లీకి వెళ్లి మరి…

Nara Lokesh  : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం జరిగింది. దీంతో చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అంటూ టిడిపి అధినేతలు మరియు చంద్రబాబు అభిమానులు నిరసనలు చేపట్టారు. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అయితే తాజాగా నారా లోకేష్ అరెస్ట్ వార్త వైరల్ గా మారింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ను ఏ 14 న పేర్కొంటూ సిఐడి 41ఎ నోటీసులను జారీ చేసింది.

cid-issued-notices-to-nara-lokesh

నోటీసులో అక్టోబర్ 4వ తేదీన ఉదయం 10 గంటలకు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజర అవ్వాల్సిందిగా తెలిపింది. అయితే లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో ఈ నోటీసులను వాట్సప్ ద్వారా పంపించడం జరిగింది. ఇక ఈ నోటీసులు అందుకున్నట్లు లోకేష్ సిఐడి కి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అయితే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో న్యాయవాదులతో మరియు జాతీయ అధికారులతో మాట్లాడేందుకు లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలోని అశోక రోడ్డు 50 లో ఎంపీ గళ్ళా జయదేవ్ ఇంట్లోనే నారా లోకేష్ ఉంటున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సిఐడి అధికారులు నారా లోకేష్ ను డైరెక్ట్ గా కలిసి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లారు.  అయితే తాము వస్తున్న విషయం ముందుగా అక్కడున్న సిబ్బందికి తెలియకపోవడంతో…

cid-issued-notices-to-nara-lokesh

సిఐడి అధికారులు కాసేపు ,గేటు బయటనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అనంతరం నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులను లోకేష్ రిసీవ్ చేసుకుని మర్యాదపూర్వకంగా వ్యవహరించారు . రాకరాక వచ్చారు కాఫీ టీలు ఏమైనా తీసుకుంటారంటూ అధికారులకు లోకేష్ ఆఫర్ చేశారు. అధికారులు మాత్రం వాటిని నిరాకరించారు. అనంతరం ఏ కేసు పై నోటీసులు ఇస్తున్నారు అనే విషయాలను లోకేష్ అధికారుల అడిగి తెలుసుకున్నారు. నోటీసులు అందుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్ అన్ని విషయాలను తెలియజేశారు. దొంగ కేసులకు భయపడేది లేదని సిఐడి అధికారులకు కచ్చితంగా సహకరిస్తామని లోకేష్ తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంచలనంగా మారింది.