Health Facts : ప్రతిరోజు చికెన్ తింటున్నారా…కాస్త ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి….

Health Facts  : నాన్ వెజ్ ప్రియులు ఎవరైనా సరే చికెన్ అంటే ఎంతో ఇష్టపడతారు. ఎందుకంటే చికెన్ తోనే ఎన్నో రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు కాబట్టి. కానీ చికెన్ వండే విధానంలో కూడా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా…?అవును ఇది నిజమే..! చాలామంది ఫ్రైడ్ చికెన్ ని ఎంతో ఇష్టపడతారు. కానీ దీనికంటే ఉడికించిన చికెన్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాగే చికెన్ ను కొనుగోలు చేసే ముందు […]

  • Published On:
Health Facts : ప్రతిరోజు చికెన్ తింటున్నారా…కాస్త ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి….

Health Facts  : నాన్ వెజ్ ప్రియులు ఎవరైనా సరే చికెన్ అంటే ఎంతో ఇష్టపడతారు. ఎందుకంటే చికెన్ తోనే ఎన్నో రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు కాబట్టి. కానీ చికెన్ వండే విధానంలో కూడా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా…?అవును ఇది నిజమే..! చాలామంది ఫ్రైడ్ చికెన్ ని ఎంతో ఇష్టపడతారు. కానీ దీనికంటే ఉడికించిన చికెన్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాగే చికెన్ ను కొనుగోలు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. మీ ఆరోగ్యం అనేది దీనిపై కూడా ప్రభావితం అయి ఉంటుంది. అయితే ముందుగా చికెన్ ను కొనుగోలు చేసే ముందు ఫ్రెష్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

are-you-eating-chicken-every-day-remember-these-few-things

అనంతరం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దానిని శుభ్రంగా కడుక్కోవాలి. అయితే రుచి కోసం దీనిని డి ఫ్రే చేసుకోకుండా ఉడికించుకుని తింటే మంచి పోషకాలు లభిస్తాయి. ఇక మార్కెట్లో అయితే రెడ్ మీట్ వైట్ మీట్ అని రెండు రకాలుగా అమ్ముతుంటారు.రెడ్ మీట్ అంటే మేక మాంసం , పంది మాంసం, గొర్రె మాంసం, ఎద్దు మాంసం..ఇక వైట్ మీట్ అంటే చికెన్ ,గుడ్లు, చేపలు వంటి వాటిని పిలుస్తుంటారు. అయితే రెడ్ మీట్ ను తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది కానీ దానిలో అధికంగా ఉండే బాడ్ కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకు పోయే అవకాశం ఉంటుంది. అందుకే రెడ్ మీట్ ను అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

are-you-eating-chicken-every-day-remember-these-few-things

ఇక వైట్ మీట్ విషయానికొస్తే దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఎందుకంటే మనం రోజు తీసుకునే కూరగాయల కంటే కూడా చికెన్ లో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే గుడ్డును ప్రతిరోజు తినడం వలన అనారోగ్యానికి తక్కువ గురవుతారని ఎప్పటినుండో వైద్యులు చెబుతున్న మాటే. అయితే చికెన్ ను చాలా మంది ఫ్రై చేసుకుని తినడం వలన దానిలోని ప్రోటీన్స్ పొందలేకపోతున్నారు. అందుకే చికెన్ ను ఉడకబెట్టుకుని తినడం మంచిది. చికెన్ ఇలా తీసుకోవడం వలన గుండె సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయని ఓ అధ్యయనంలోతేలింది.

are-you-eating-chicken-every-day-remember-these-few-things

అంతేకాక చికెన్ లో ఉండే అమైనో ఆసీడ్స్ పిల్లల పెరుగుదలను ప్రోత్సహించే విధంగా తోడ్పడతాయి. ఇక గ్రిల్డ్ చికెన్ తినడం వలన ఒత్తిడి సమస్య నుంచి బయటపడతారు. అయితే ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తున్నాయి కదా అని ప్రతిరోజు చికెన్ తింటే అనారోగ్య సమస్యలు తప్పవు. ఎక్కువగా తీసుకుంటే అమృతమైన విషయమే. కావున దీనిని దృష్టిలో పెట్టుకొని వారానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే చికెన్ తీసుకోండి. అన్నీటికంటే ముఖ్యంగా కోళ్ల ఫారం కోళ్లను తినడం కంటే నాటు కోళ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.