Viral News : విడాకులు తీసుకోబోతున్న మరో స్టార్ జంట…

Viral News  : ప్రస్తుత కాలంలో పెళ్లి విడాకులు అనేవి సర్వసాధారణంగా మారాయి. మరి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఈ ధోరణి ఎక్కువగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నాళ్లకే విడిపోయారు. అయితే తాజాగా ఓ బాలీవుడ్ సినీ సెలబ్రిటీల జంట కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు షర్దిన్ ఖాన్ , నటాషా మధ్వాని విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే బాలీవుడ్ […]

  • Published On:
Viral News : విడాకులు తీసుకోబోతున్న మరో స్టార్ జంట…

Viral News  : ప్రస్తుత కాలంలో పెళ్లి విడాకులు అనేవి సర్వసాధారణంగా మారాయి. మరి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఈ ధోరణి ఎక్కువగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నాళ్లకే విడిపోయారు. అయితే తాజాగా ఓ బాలీవుడ్ సినీ సెలబ్రిటీల జంట కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు షర్దిన్ ఖాన్ , నటాషా మధ్వాని విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే బాలీవుడ్ నటుడు షర్దిన్ ఖాన్ నటి ముంతాజ్ కూతురు నటాషాను 2005లో పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరికి దియాని ఇసబెల్లా ఖాన్ ( 10 ) అనే కూతురు మరియు అజారియస్ షర్దిన్ ఖాన్ ( 6 ) అనే కుమారుడు కూడా జన్మించారు.

another-star-couples-divorced-in-the-industry

దాదాపు 18 సంవత్సరాల సుదీర్ఘ జీవనం తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి వాటిని పరిష్కరించుకోలేని క్రమంలో విడిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాక వీరిద్దరూ గత సంవత్సరం నుండి విడివిడిగా జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. అయితే గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో భాగంగా షర్దిన్ ఖాన్ మాట్లాడుతూ …. 2011లో మేము లండన్ కు షిఫ్ట్ అయ్యామని…సంతాన సమస్యలు ఉండడంతో అక్కడ ఓ డాక్టర్ ను సంప్రదించామని తెలియజేశారు. ఇక ఐవిఎఫ్ ద్వారా నటాషా గర్భంలో కవలలు ప్రవేశించారని…కానీ దురదృష్టవశాత్తు 6వ నెలలోనే వారిద్దరు ప్రాణాలు వదిలారు.అతి త్వరలో ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని ఆడించబోతున్నామన్న ఆనందంలో ఉన్న మాకు ఆ వార్త షాక్ కి గురి చేసింది.

another-star-couples-divorced-in-the-industry

ఈ నేపథ్యంలో నటాషా కూడా ఎంతగానో కుమిలిపోయింది. ఇక ఆ తర్వాత మాకు పాప పుట్టింది. ఇక అప్పుడు మా ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఎన్నో కఠినమైన పరిస్థితులు ఎదురుకున్న తర్వాత పాప మా జీవితాల్లోకి రావడంతో ఎంతో సంతోషించామని షర్థిన్ చెప్పుకోచ్చాడు . ఇది ఇలా ఉండగా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న షర్దిన్ త్వరలోనే రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో విస్ ఫుట్ సినిమాతో పాటు నో ఎంట్రీ సీక్వెల్ లో సర్దిన్ నటించనునట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్దాల రావడంతో వీరిద్దరూ విడిపోయేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.