Tirupati Temple : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్…8 గంటల పాటు ఆలయం మూసివేత…

Tirupati Temple  : ఈ సంవత్సరంలో చంద్రగ్రహణం రెండోసారి రాబోతుంది. చివరిదైనా చంద్రగ్రహణం ఈనెల 29 న ఏర్పడనున్నట్లు సమాచారం. మనదేశంలో కూడా ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం చూపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అయితే హిందువులు గ్రహణ సమయాన్ని సూతక కాలంగా భావిస్తారు. ఇక ఈ సమయంలో ఎలాంటి పనులు చేయరు. ఈ క్రమంలోనే పూజాగదిని కూడా మూసేస్తారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 29 తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్న కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుమల […]

  • Published On:
Tirupati Temple :  తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్…8 గంటల పాటు ఆలయం మూసివేత…

Tirupati Temple  : ఈ సంవత్సరంలో చంద్రగ్రహణం రెండోసారి రాబోతుంది. చివరిదైనా చంద్రగ్రహణం ఈనెల 29 న ఏర్పడనున్నట్లు సమాచారం. మనదేశంలో కూడా ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం చూపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అయితే హిందువులు గ్రహణ సమయాన్ని సూతక కాలంగా భావిస్తారు. ఇక ఈ సమయంలో ఎలాంటి పనులు చేయరు. ఈ క్రమంలోనే పూజాగదిని కూడా మూసేస్తారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 29 తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్న కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుమల తిరుపతి ఆలయాన్ని దాదాపు 8 గంటల పాటు మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలియజేశారు.

alert-to-devotees-of-tirumala-srivari-temple-will-be-closed-for-8-hours

అక్టోబర్ 28 రాత్రి సమయంలో శ్రీవారి ఆలయాన్ని మూసివేసి చంద్రగ్రహణం అనంతరం అక్టోబర్ 29న తిరిగి ఆలయాన్ని తెరవనున్నారు. అయితే ఈ నెల 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నిమిషాల నుండి తెల్లవారుజామున 2:22 నిమిషాల మధ్యకాలంలో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. కాబట్టి ముందు రోజు అక్టోబర్ 28న రాత్రి 7:05 నిమిషాలకి స్వామివారి అన్ని రకాల దర్శనాలను నిలిపివేస్తారు. అలాగే శ్రీవారి ఆలయ తలుపులను మూసేస్తారు.

alert-to-devotees-of-tirumala-srivari-temple-will-be-closed-for-8-hours

గ్రహణం విడిచిన అనంతరం తిరిగి అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 3:15 నిమిషాలకు ఆలయానికి కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తారు. స్వామి వారి ఆలయ ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులను తెరుస్తారు. అంటే చంద్రగ్రహణం కారణంగా శనివారం సాయంత్రం నుండి తెల్లవారుజామున వరకు దాదాపు 8 గంటల పాటు ఆలయ తలుపులను మూసేస్తారన్నమాట . ఈ నేపథ్యంలో స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవతోపాటు వికలాంగులు సీనియర్ సిటిజన్స్ దర్శనాలను అక్టోబర్ 28న రద్దు చేయనున్నారు. ఇక ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని శ్రీవారి భక్తులు వారి ప్రయాణాలను దానికి అనుగుణంగా మార్చుకోవాలని టీటీడీ అధికారులు తెలియజేశారు.