Mumbai : 110 రోజులపాటు కఠిన ఉపవాసం చేసిన 16 ఏళ్ళ బాలిక… ఎందుకో తెలిసా…?

Mumbai : ముంబై కు చెందిన పదహారేళ్ల బాలిక తన ఉపవాస దీక్షతో అరుదైన ఘనతను సాధించింది. అయితే ఈ అమ్మాయి రికార్డు బ్రేక్ చేయడం కోసం లేదా అరుదైన ఘనతను సాధించడం కోసం ఈ ఉపవాసం చేయలేదు. జైన మతాన్ని అమితంగా నమ్మిన బాలిక ఏకంగా 110 రోజులు ఉపవాసం చేసింది. అయితే జైన మతంలో ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ జైన మతంలోని వారు శ్లేఖ వ్రతాన్ని ఆచరిస్తూ ఉపవాసం చేస్తుంటారు. ఈ […]

  • Published On:
Mumbai : 110 రోజులపాటు కఠిన ఉపవాసం చేసిన 16 ఏళ్ళ బాలిక… ఎందుకో తెలిసా…?

Mumbai : ముంబై కు చెందిన పదహారేళ్ల బాలిక తన ఉపవాస దీక్షతో అరుదైన ఘనతను సాధించింది. అయితే ఈ అమ్మాయి రికార్డు బ్రేక్ చేయడం కోసం లేదా అరుదైన ఘనతను సాధించడం కోసం ఈ ఉపవాసం చేయలేదు. జైన మతాన్ని అమితంగా నమ్మిన బాలిక ఏకంగా 110 రోజులు ఉపవాసం చేసింది. అయితే జైన మతంలో ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ జైన మతంలోని వారు శ్లేఖ వ్రతాన్ని ఆచరిస్తూ ఉపవాసం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ముంబైకి లో ఓ జైన కుటుంబానికి చెందిన పదహారేళ్ల బాలిక ఏకంగా 110 రోజులపాటు ఉపవాసం చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. 110 రోజులు అంటే ఏకంగా మూడు నెలలు కఠిన ఉపవాసం అన్నమాట. ఇక ఈ మూడు నెలల్లో కేవలం మంచినీరు మాత్రమే ఆమె తీసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే…

a-16-year-old-girl-fasted-for-110-days-do-you-know-why

ముంబై కు చెందిన జిగర్ షా ,రూపా షా అనే దంపతులు జైన మతాన్ని ఆచరిస్తూ నివసిస్తుంటారు. అయితే వారికి పదహారేళ్ల క్రిష అనే కుమార్తె ఉంది. చిన్నప్పటినుండి తల్లిదండ్రులు జైన మతాన్ని కుమార్తెకు బోధిస్తూ ఉండటంతో క్రిష కూడా జైన మత నియమాలను పాటిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే గత జులై 11న క్రిష 16 రోజులపాటు ఉపవాసం చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం నీరు మాత్రమే తాగుతూ ఈ ఉపవాసాన్ని చేస్తారు. అయితే క్రిష ఈ నియమాలను పాటిస్తూ ఉపవాసం చేసినప్పటికీ ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదు. దీంతో క్రిష ఉపవాస దీక్షను కొనసాగించవచ్చని తల్లి రూపా తెలియజేశారు.

a-16-year-old-girl-fasted-for-110-days-do-you-know-why

అలాగే తన జైన గురువు ముని పద్మకలస్ మహారాజ్ అనుమతితో ఏకంగా 110 రోజులపాటు ఉపవాసం చేసింది. అయితే ఈ ఉపవాసంలో ఉదయం 9 నుండి సాయంత్రం 6:30 నిమిషాల వరకు కేవలం కాచి చల్లార్చిన నీరు మాత్రమే తీసుకోవాలట. ఈ నియమాలన్నీ పాటిస్తూ క్రిష ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోకుండానే దీక్ష లో విజయం సాధించింది. అయితే ఉపవాస దీక్ష మొదటి 40 రోజులు క్రిష కాలేజీకి కూడా వెళ్లిందట. ఇక ఈ దీక్షతో ఆమె ఏకంగా 18 కేజీల బరువు తగ్గినట్లు సమాచారం. అయినప్పటికీ ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకపోవడం గమనార్హం. ఈ విధంగా 3 నెలల 20 రోజుల పాటు కట్టిన దీక్ష చేసిన అతి చిన్న వయసుకురాలిగా క్రిష రికార్డు సృష్టించింది. దీంతో స్థానికంగా ఈ వార్త తీవ్ర చర్చనియాంశంగా మారింది.