Tamarind leaves : చింతచిగురు ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Tamarind leaves : చింతచిగురు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక ఈ చింత చిగురుని ఎక్కువగా తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రలలో వివిధ రకాల వంటకాలలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇక దీని రుచి విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే చింతచిగురుని ఎండబెట్టి కూడా కొన్ని వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా చింతచిగురు పప్పు, చింతచిగురు రొయ్యలు ,చింతచిగురు చికెన్ కాంబినేషన్ అయితే అమృతంలా అనిపిస్తుంది. అందుకే చాలామంది చింత చిగురును ఎంతో ఇష్టంగా […]

  • Published On:
Tamarind leaves : చింతచిగురు ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Tamarind leaves : చింతచిగురు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక ఈ చింత చిగురుని ఎక్కువగా తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రలలో వివిధ రకాల వంటకాలలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇక దీని రుచి విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే చింతచిగురుని ఎండబెట్టి కూడా కొన్ని వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా చింతచిగురు పప్పు, చింతచిగురు రొయ్యలు ,చింతచిగురు చికెన్ కాంబినేషన్ అయితే అమృతంలా అనిపిస్తుంది. అందుకే చాలామంది చింత చిగురును ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ చింతచిగురుని తినడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

you-will-be-shocked-to-know-the-benefits-of-tamarind-leaves

మరి ముఖ్యంగా కామెర్ల సమస్యతో బాధపడే వారికి చింతచిగురు దివ్య ఔషధమని చెబుతున్నారు. దీనికోసం చింతచిగురు నుండి రసాన్ని తీసి దానిలో కొంచెం పట్టిక బెల్లం కలుపుకుని తాగితేే కామెర్ల వ్యాధి వెంటనే తగ్గిపోతుంది. అలాగే చింతచిగురుని తీసుకోవడం వలన వాతం వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. అలాగే పలు రకాల వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు సమస్యతో బాధపడే వారికి చింత చిగురు తినడం వలన ఇట్టే నొప్పులు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. అలాగే గొంతు నొప్పి ,గొంతు సమస్యల నుండి కూడా చింతచిగురు రక్షిస్తుంది.

you-will-be-shocked-to-know-the-benefits-of-tamarind-leaves

అయితే గొంతు నొప్పి, గొంతు వాపు ,గొంతు మంట వంటి సమస్యలతో బాధపడేవారు చింత చిగురును నీటిలో బాగా మరిగించి వేడిగా ఉన్నప్పుడు నోట్లో వేసుకుని పుక్కిలించడం ద్వారా ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే కడుపులో నులిపురుగులు పడిన వారికి చింతచిగురు తినిపించడం వలన పురుగులు నశిస్తాయి. అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు కూడా చింత చిగురు తినవచ్చు. చింత చిగురుని తీసుకోవడం వలన థైరాయిడ్ అదుపులో ఉంటుంది. అలాగే రక్తాన్ని శుభ్రం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే చింతచిగురులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండటం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తద్వారా గ్యాస్ మలబద్ధకం కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దరి చేరవు.అలాగే చిన్నపిల్లలకు సైతం మంచి బలాన్ని ఇచ్చే ఆకుకూరల్లో ఇది కూడా ఒకటని చెప్పాలి.