Warts Removing : పులిపిర్లు వస్తే ఏం చేయాలి…శాశ్వత పరిష్కారం ఇదే….

Warts Removing : చాలామంది శరీరంపై పులిపిర్లు అనేవి వస్తుంటాయి. అయితే అసలు ఈ పులిపిర్లు ఎందుకు వస్తాయో మీకు తెలుసా…?సహజంగా వచ్చే ఈ పులిపిర్ల వలన ఎలాంటి నొప్పి లేకపోయినప్పటికీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇవి చూసేందుకు ఎదుటివారికి చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి. అంతేకాక ఇది రావడం కూడా కాళ్లు ,చేతులు , మేడ ముక్కు వంటి ప్రధాన భాగాలలోనే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇవి మెంటల్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మరియు […]

  • Published On:
Warts Removing : పులిపిర్లు వస్తే ఏం చేయాలి…శాశ్వత పరిష్కారం ఇదే….

Warts Removing : చాలామంది శరీరంపై పులిపిర్లు అనేవి వస్తుంటాయి. అయితే అసలు ఈ పులిపిర్లు ఎందుకు వస్తాయో మీకు తెలుసా…?సహజంగా వచ్చే ఈ పులిపిర్ల వలన ఎలాంటి నొప్పి లేకపోయినప్పటికీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇవి చూసేందుకు ఎదుటివారికి చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి. అంతేకాక ఇది రావడం కూడా కాళ్లు ,చేతులు , మేడ ముక్కు వంటి ప్రధాన భాగాలలోనే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇవి మెంటల్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మరియు బాడీలో తగినంత ఇమ్యూనిటీ పవర్ లేనప్పుడు , అలాగే హార్మోన్ బాలన్స్ తప్పినప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ కారణంగా ఈ పులిపిర్లు వస్తుంటాయి.

what-to-do-if-warts-appear-this-is-the-permanent-solution

ఇక ఈ సమస్య పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలలోనే కనిపిస్తుంది. ఎందుకంటే స్త్రీలలో హార్మోనియం ఇన్ బ్యాలెన్స్ ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పులిపీర్లను ఎట్టి పరిస్థితుల్లో చేతి గొళ్లతో గిల్లకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వలన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీటిని శాశ్వతంగా పోగొట్టేందుకు ఓ చిట్కా మీకోసం తీసుకొచ్చాం. అదేంటి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక తమలపాకు తీసుకుని శుభ్రంగా కడిగి తొడిమ కింద వరకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని కొంచెం సున్నం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు తమలపాకు తోడేమతో సున్నం కొంచెం తీసుకుని పులిపిర్లు ఉన్నచోట పెట్టాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సున్నం పెట్టడం వలన చర్మం పొక్కి కాస్త మంటగా అనిపిస్తుంది. అందుకే దీనిని చేతితో పట్టుకోకుండా తమలపాకు సహాయంతో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఎలాంటి ఇబ్బంది కలగదు.ఈ విధంగా ప్రతిరోజు చేయడం వలన పులిపిర్లు రాలిపోతాయి. ఇక రాలిపోయిన తర్వాత వచ్చే మచ్చ పోవడానికి ఆ ప్రదేశంలో నిమ్మరసంతో కలిపిన తేనెను రాసుకోవచ్చు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించాం. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.