Kidney Health Tips : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి…ఎల్లప్పుడూ ఫిట్ గా ,ఆరోగ్యంగా ఉంటారు.

Kidney Health Tips : రోజువారి జీవితంలో మనం చేసే కొన్ని పొరపాట్లు వలన మన కిడ్నీలకు హాని కలుగుతుందని మీకు తెలుసా… ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సులబమైన పద్ధతులను ఉపయోగించి మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు ఎలాంటి హాని కలగకుండా కాపాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం అనారోగ్యకరమైన జీవనశైలని అనుసరించడం వలన చాలామంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం రోజువారి తీసుకునే ఆహారం మరియు వాతావరణంలో జరిగే మార్పులు అని […]

  • Published On:
Kidney Health Tips : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి…ఎల్లప్పుడూ ఫిట్ గా ,ఆరోగ్యంగా ఉంటారు.

Kidney Health Tips : రోజువారి జీవితంలో మనం చేసే కొన్ని పొరపాట్లు వలన మన కిడ్నీలకు హాని కలుగుతుందని మీకు తెలుసా… ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సులబమైన పద్ధతులను ఉపయోగించి మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు ఎలాంటి హాని కలగకుండా కాపాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం అనారోగ్యకరమైన జీవనశైలని అనుసరించడం వలన చాలామంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం రోజువారి తీసుకునే ఆహారం మరియు వాతావరణంలో జరిగే మార్పులు అని చెప్పవచ్చు.

దీంతో ప్రస్తుతం చాలామంది గుండె జబ్బులతో కూడా బాధపడుతున్నారు. అయితే రోజువారి పనుల్లో మనం చేసే కొన్ని పొరపాట్లు కిడ్నీలకు హాని కలిగిస్తున్నాయి. అలాంటి పరిస్థితులలో ఈ చిట్కాలను ఉపయోగించి మనం కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు పాడైపోకుండా కాపాడుకోవచ్చు. అయితే అలసట, నిద్ర లేకపోవడం, దురద, ముఖం లేదా పాదాలవాపు , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూత్రంలో రక్తం వంటి లక్షణాలు మూత్రపిండాల వ్యాధిని సూచించే లక్షణాలని చెప్పవచ్చు. కొన్ని వార్తలు మరియు కథనాల ప్రకారం కిడ్నీ సంరక్షణ చిట్కాలను మీకోసం తీసుకొచ్చాం. వీటిని అనుసరించి ఈ వ్యాధులను అధిగమించవచ్చు.

ఎక్కువ మందులు తీసుకోకూడదు…

రోజు మందులు వేసుకోవడం వలన కిడ్నీపై ప్రభావం చూపుతాయి. అలాగే యాంటీబయేటిక్ మందులు కూడా కిడ్నీని దెబ్బతీసే అవకాశం ఉంది. హెర్బల్ సప్లిమెంట్స్ వలన కిడ్నీలకు మరింత నష్టం కలిగే అవకాశం ఉంది. అందుకే మందులను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

these-precautions-must-be-taken-to-keep-the-kidneys-healthy-always-fit-and-healthy

నీరు ఎక్కువగా తాగాలి…

నీరు అనేది మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. నీరు ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీలో ఉండే టాక్సిన్స్ తొలగిపోతాయి. నీటిని అధికం గా తీసుకోవడం వలన డిహైడ్రేట్ అవ్వడం, కిడ్నీలో రాళ్లు రావడం లాంటి సమస్యలు తగ్గుతాయి.

these-precautions-must-be-taken-to-keep-the-kidneys-healthy-always-fit-and-healthy

వ్యాయామం చేయాలి..

మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి ప్రతిరోజు 30 నుండి 60 నిమిషాల పాటు వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం చేయడం వలన మధుమేహం ,గుండె జబ్బులు వంటివి కూడా తగ్గుతాయి.

these-precautions-must-be-taken-to-keep-the-kidneys-healthy-always-fit-and-healthy

 

ధూమపానం , మద్యపానం కి దూరం గా ఉండాలి….

కిడ్నీ సమస్యలు రావడానికి ధూమపానం అతిపెద్ద కారణమని చెప్పాలి. అలాగే మద్యపానం ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీలపై ప్రభావం చూపుతాయి.

these-precautions-must-be-taken-to-keep-the-kidneys-healthy-always-fit-and-healthy

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీన్ని ధృవీకరించలేదు.