Health Care : ఉల్లిపాయ జ్యూస్ తో ఎన్ని లాభాలో….ఈ ఐదు సమస్యల నుండి ఉపశమనం….

Health Care  : ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే మన రోజువారి ఆహార పదార్థాలలో ఉల్లిపాయలు లేకుండా అసలు ఏది సాధ్యం కాదు. ఉల్లిపాయ తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా సహాయపడుతుంది. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు క్యాన్సర్ ను నిరోధించే లక్షణాలు ఉన్నాయి. అయితే ఉల్లిపాయను రసంల చేసుకుని తీసుకోవడం వలన చాలా వ్యాధులను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి […]

  • Published On:
Health Care : ఉల్లిపాయ జ్యూస్ తో ఎన్ని లాభాలో….ఈ ఐదు సమస్యల నుండి ఉపశమనం….

Health Care  : ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే మన రోజువారి ఆహార పదార్థాలలో ఉల్లిపాయలు లేకుండా అసలు ఏది సాధ్యం కాదు. ఉల్లిపాయ తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా సహాయపడుతుంది. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు క్యాన్సర్ ను నిరోధించే లక్షణాలు ఉన్నాయి. అయితే ఉల్లిపాయను రసంల చేసుకుని తీసుకోవడం వలన చాలా వ్యాధులను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఉల్లిపాయ రసంతో కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…. కిడ్నీలో రాళ్లు ఏర్పడడం వలన చాలా నొప్పిని భరించాల్సి ఉంటుంది.

soo-many-benefits-of-onion-juice-relief-from-these-five-problems

ఇక ఈ సమస్యతో బాధపడేవారు ఉల్లిపాయ రసాన్ని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన అనతి కాలంలోనే కిడ్నీలో రాళ్లు మరియు నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. కిడ్నీలో రాళ్ళను తొలగించేందుకు ఉల్లిపాయ రసం చాలా బాగా సహాయపడుతుంది. అలాగే డయాబెటిస్ కలవారు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునేందుకు ఉల్లిపాయ రసం తీసుకోవడం చాలా మంచిది. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఎలర్జీ , యాంటీ ఆక్సిడెంట్స్ మరియు కార్సినోజెనిక్ లక్షణాలు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు తోడ్పడతాయి. అలాగే ఉల్లిపాయలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది.

అంతేకాక కీలనొప్పితో బాధపడేవారు ఈ ఉల్లిపాయ రసం తాగడం వలన అనతి కాలంలోనే మార్పును గమనించవచ్చు. అయితే ఉల్లిపాయ రసంలో ఆవనూనెను కలిపి మసాజ్ చేసుకోవడం ద్వారా కూడా కీల నొప్పుల నుంచి ఉపశమనంనం పొందవచ్చు. ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. ఈ సమస్యను తగ్గించుకునేందుకు మార్కెట్లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ ను వినియోగిస్తున్నారు. దానికి బదులుగా ఉల్లిపాయ రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టు కుదలకు పట్టేలా రాయడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధృవీకరించలేదు.