Health Care : జలుబు దగ్గు సమస్యతో విపరీతంగా బాధపడుతున్నారా…దీనిని ట్రై చేయండి ఇక నో టెన్షన్…
Health Care : చలికాలంలో జలుబు దగ్గు వంటి సమస్యలు వచ్చాయంటే ఏమాత్రం తగ్గవు. అంతేకాక ఊపిరితిత్తుల్లో కపం కూడా పెరిగిపోతుంది. దీనివలన ఏ పని చేయాలనుకున్నా ఓపిక సరిపోదు. అలాగే దగ్గి దగ్గి ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఇలాంటి సమయంలో వంటింట్లో లభించే కొన్ని ఆహార పదార్థాలను ఉపయోగించి జలుబు దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులసీ […]
Health Care : చలికాలంలో జలుబు దగ్గు వంటి సమస్యలు వచ్చాయంటే ఏమాత్రం తగ్గవు. అంతేకాక ఊపిరితిత్తుల్లో కపం కూడా పెరిగిపోతుంది. దీనివలన ఏ పని చేయాలనుకున్నా ఓపిక సరిపోదు. అలాగే దగ్గి దగ్గి ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఇలాంటి సమయంలో వంటింట్లో లభించే కొన్ని ఆహార పదార్థాలను ఉపయోగించి జలుబు దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తులసీ తమలపాకు…
తమలపాకులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి దగ్గు రాకుండా ఉండేందుకు ఎంతగానో సహాయపడతాయి. అయితే జలుబు దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం తులసి ఆకులను నమలడం మంచిది. అలా కాకపోతే తులసిని నీటిలో మరిగించి కషాయంల తీసుకోవడం కూడా సరైన పద్ధతి. అయితే తాజాగా phototherapy research జనరల్ లో ప్రచూరించిన ఒక అధ్యయనం ప్రకారం తులసి ఆకులను తినడం లేదా నమలడం వలన దగ్గు జలుబు వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తున్నట్లుగా స్పష్టమైంది.
తేనె…
వంటింట్లో విరివిగా ఉపయోగించే ఔషధాలలో తేనె కూడా ఒకటి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ మైక్రోబయలు లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా నియాసిస్ రైబోఫ్లోవిన్ వంటి మూలకాలను అధికంగా కలిగి ఉంటుంది. ఇవి ఊపిరితిత్తుల్లోని కాపాన్ని తొలగించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. కావున గోరు వెచ్చటి నీటిలో ఒక చెంచా తేనె కలిపి ప్రతిరోజు తీసుకోవడం వలన దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
పసుపు….
దగ్గు జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక పసుపులో ఉండే యాంటీ ఇంప్లిమెంటరీ మరియు యాంటీసెప్టిక్ మరియు యాంటీ వైరస్ లక్షణాలు దగ్గు జలుబు వంటి సమస్యలను తగ్గిస్తాయి.
దాల్చిన చెక్క…
దాల్చిన చెక్కలో వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అదేవిధంగా దాల్చిన చెక్క పొడిని తేనెలో కలిపి ప్రతి రోజు తీసుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.
అల్లం..
వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే వాటిలో అల్లం కూడా ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక అల్లం లో ఉండే యాంటీ ఇంప్లిమెంటరీ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఇమ్యూనిటీని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కావున దగ్గు మరియు జలుబు నివారణకు అల్లం దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.