Side Effects of Holding Urine : తరచుగా యూరిన్ కి వెళ్తున్నారా ఈ సమస్యలు ఉండొచ్చు జాగ్రత్త…

Side Effects of Holding Urine : కొంతమంది అనేక రకాల కారణాల వలన చాలాసేపు యురిన్ ఆపుకుంటూ ఉంటారు. ఇలా వాష్ రూమ్ ని యూస్ చేయరు. ఇలా చేయడం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే నీళ్లు కూడా తగిన మోతాదులో తీసుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు. యూరోన్ ఎక్కువ సేపు ఆపుకోవడం వలన మరియు నీటిని ఎక్కువగా తాగకపోవడం వలన కిడ్నీలపై ఇది ఎఫెక్ట్ అవుతుంది. […]

  • Published On:
Side Effects of Holding  Urine  : తరచుగా యూరిన్ కి వెళ్తున్నారా ఈ సమస్యలు ఉండొచ్చు జాగ్రత్త…

Side Effects of Holding Urine : కొంతమంది అనేక రకాల కారణాల వలన చాలాసేపు యురిన్ ఆపుకుంటూ ఉంటారు. ఇలా వాష్ రూమ్ ని యూస్ చేయరు. ఇలా చేయడం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే నీళ్లు కూడా తగిన మోతాదులో తీసుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు. యూరోన్ ఎక్కువ సేపు ఆపుకోవడం వలన మరియు నీటిని ఎక్కువగా తాగకపోవడం వలన కిడ్నీలపై ఇది ఎఫెక్ట్ అవుతుంది. మరియు అనేక రకాల ఇన్ఫెక్షన్ ల బారిన పడతాము. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది యూరిన్ వస్తున్న సరే ఎక్కువసేపు ఆపుకుంటూ ఉంటారు. అయితే దీనికి రకరకాల కారణాలు ఉండవచ్చు. ఇక పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేయాల్సి వచ్చినప్పుడు లేదా పని బిజీలో పడినప్పుడు కానీ కొంతమంది నిద్రిస్తున్నప్పుడు బాగా బద్ధకంతో వాష్ రూమ్ యూస్ చేయకుండా ఉంటారు.  అయితే ఇలాంటి కొన్ని కారణాల చేత చాలామంది యూరిన్ ఆపుకుంటూ ఉంటారు. అయితే మనం లేడర్ గనక చూసుకున్నట్లయితే 400 మిల్లీలీటర్ నుంచి 600 మిల్లీలీటర్ వరకు మూత్రాన్ని ఉంచుకోగలుగుతుంది.

ఆపైన మనం యూరిన్ ని కనుక ఆపుకుంటూ ఉంటే అది లేడర్ పై ఒత్తిడి పడి అనేక రకాల అనారోగ్య సమస్యలు కు దారితీసే అవకాశాలు ఉన్నాయని నిపుణుల హెచ్చరిస్తున్నారు. మరి ఎలాంటి రకమైన ఒత్తిడి పడి ఇలా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువగా కనిపించే ఇన్ఫెక్షన్ ను యూరిన్ ఇన్ఫెక్షన్ అని పిలుస్తాం. యు టి ఐ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. ఇది ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది. ఒక్కసారి యు టి ఐ అయి వస్తే మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యూటీఐ బారిన పడకుండా ఉండాలి. అంటే యూరిన్ ని ఎక్కువసేపు ఆపకుండా ఉండాలి. చాలాసేపు ఆపుకుని ఒక్కసారి వస్తే మన మూత్ర విసర్జన చేసే సమయంలో బాగా మంటగా ఉంటుంది. నొప్పిగా ఉంటుంది. తరచుగా వాష్ రూమ్ వెళ్ళవలసి వస్తుంది. అయితే కొంతమందికి కడుపునొప్పి కూడా వస్తుంది. కాబట్టి ఈ సమస్యలు ఏమీ రాకుండా ఉండాలి అంటే మనం ఎక్కువసేపు యూరిన్ ఆపుకోకుండా ఉండాలి.

ఇక మనలో చాలామందికి తెలిసినట్లే ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకొని ఉన్నట్లయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కుడా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలిసిన విషయమే ప్రస్తుత కాలంలో ఈ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు కూడా. ఇక ఈ కిడ్నీలో రాళ్లు ఏర్పడితే కనుక కొన్నిసార్లు అది సర్జరీ ఆపరేషన్ చేసి మరి రాళ్లను తీయవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా యూరిన్ ని ఎక్కువసేపు ఆపుకోకుండా ఉండాలి. తరచుగా వాషింగ్ యూస్ చేస్తూ ఉండాలి. మరియు తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. కిడ్నీలో రాళ్లు పడినప్పుడు ఇలానే మూత్రాన్ని తరచుగా ఆపుకుంటూ ఉంటే కిడ్నీలో రాళ్లు పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇలా రోజు రోజుకి మూత్ర విసర్జన ఆపుకుంటూ ఉంటే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలపడుతూ ఉంటాయి. దీని ద్వారా మనం ఏ పరిస్థితికి వస్తామంటే మనం తుమ్మిన తగ్గిన సరే ఆ యూరిన్ అనేది బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇక మూత్ర విసర్జన చేయకుండా ఎక్కువసేపు మన మూత్రాన్ని ఆపుకుంటే కనుక తీవ్ర నొప్పికి కారణం అవుతుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా యూరిన్ ఆపుకోకుండా వెంటనే విడుదల చేయడం మంచిది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీన్ని ధ్రువీకరించలేదు..