Health Care : రాత్రి సమయంలో ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా..అయితే ఇవి తెలుసుకోండి…

Health Care : ప్రస్తుత కాలంలో పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు చేతులో నిరంతరం ఉండే పరికరం ఏదైనా ఉంది అంటే అది సెల్ ఫోన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు వారి చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా దానిలో నిమగ్నం అయిపోతారు. అయితే ఫోన్ విచ్చలవిడిగా వినియోగించడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరీ […]

  • Published On:
Health Care : రాత్రి సమయంలో ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా..అయితే ఇవి తెలుసుకోండి…

Health Care : ప్రస్తుత కాలంలో పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు చేతులో నిరంతరం ఉండే పరికరం ఏదైనా ఉంది అంటే అది సెల్ ఫోన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు వారి చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా దానిలో నిమగ్నం అయిపోతారు. అయితే ఫోన్ విచ్చలవిడిగా వినియోగించడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో అతిగా స్మార్ట్ ఫోన్ వినియోగించడం వలన నిద్రలేమి సమస్య రావడంతో పాటు మరికొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బ్లూ లైట్ ఎక్స్పోజర్…

మనం ప్రతిరోజు వినియోగించే స్మార్ట్ ఫోన్ నీలిరంగు కాంతిని విడుదల చేస్తూ ఉంటుంది. అయితే మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే ఈ బ్లూ లైట్ కంటికి ఎక్కువగా గురైతే నిద్రకు అంతరాయం కలుగుతుంది. మరి ముఖ్యంగా సోషల్ మీడియా సైట్లను వీక్షించడం వలన మీ దృష్టి అంత వాటిపైన యాక్టివ్ గా ఉంటుంది. దీంతో మీరు తగినంత నిద్రపోవడానికి అవకాశం ఉండదు. దీని కారణంగా నిద్ర లేకుండా చాలా ఇబ్బందికి గురవుతుంటారు. కావున రాత్రి సమయంలో మొబైల్ ఫోన్ వీలైనంత తక్కువగా వాడడం మంచిది.

ఒత్తిడి పెరిగే ప్రమాదం….

ప్రశాంతంగా ఉండే వారికి నిద్ర త్వరగా పడుతుంది. కానీ ప్రతి నిమిషం ఒత్తిడికి గురయ్యే వారికి నిద్ర సరిగా పట్టదు. ఇక ఇలాంటి వారు ఫోన్ లో కాలక్షేపం చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. దీని కారణంగా నిద్ర సమస్యకు మరింత దగ్గరవుతుంటారు. అంతేకాక ఒత్తిడి స్థాయి కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ. ఇక ఇది నిరంతరం కొనసాగినట్లయితే మానసిక సమస్యగా మారే అవకాశాలు ఉన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.

కంటి సమస్యలు…

అయితే రాత్రి సమయంలో ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వలన దాని యొక్క ఎఫెక్ట్ కళ్ళ పైన పడుతుంది. తద్వారా కళ్ళు బాగా అలసిపోతాయి. మరి ముఖ్యంగా రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న లైట్లను కూడా ఆఫ్ చేసి ఫోన్ ఉపయోగించినట్లయితే దాని ప్రభావం మరింత పెరిగినట్లు అవుతుంది. దీని వలన ఫోన్ లో నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా కళ్ళు పగటివేల కంటే కూడా ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది. తద్వారా కళ్ళపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా కళ్ళు పోరిబారడం ,కంటి సమస్యలు, దూరదృష్ట వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అలవాట్లకు ఇప్పుడే గుడ్ బై చెప్పడం మంచిది. లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.