Tea Side Effects : ప్లాస్టిక్ కప్స్ లో టీ ఎక్కువగా తాగుతున్నారా…అయితే ఈ విషయాలు తెలుసుకోండి…

Tea Side Effects : టీ తాగడం వలన శరీరానికి మరియు మనసుకి రిఫ్రెష్ గా అనిపిస్తుంది. అందుకే చాలామంది వారి రోజుని టీతో ప్రారంభిస్తారు. మరి ముఖ్యంగా జాబ్ చేసేవారైతే రోజులో రెండుసార్లు కంటే ఎక్కువ టీ తాగుతారు. వారి పనిలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు టీ కి బానిసలు అవుతున్నారు. అయితే రోజులో రెండుసార్ల కంటే ఎక్కువ టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాక టీ తాగే సమయంలో కొన్ని […]

  • Published On:
Tea Side Effects : ప్లాస్టిక్ కప్స్ లో టీ ఎక్కువగా తాగుతున్నారా…అయితే ఈ విషయాలు తెలుసుకోండి…

Tea Side Effects : టీ తాగడం వలన శరీరానికి మరియు మనసుకి రిఫ్రెష్ గా అనిపిస్తుంది. అందుకే చాలామంది వారి రోజుని టీతో ప్రారంభిస్తారు. మరి ముఖ్యంగా జాబ్ చేసేవారైతే రోజులో రెండుసార్లు కంటే ఎక్కువ టీ తాగుతారు. వారి పనిలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు టీ కి బానిసలు అవుతున్నారు. అయితే రోజులో రెండుసార్ల కంటే ఎక్కువ టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాక టీ తాగే సమయంలో కొన్ని విషయాలను కూడా గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్లాస్టిక్ కప్స్….

side-effects-of-drinking-too-much-tea

ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వినియోగం అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలామంది వారి ఆఫీసులలో ప్లాస్టిక్ కప్పు లలో టీ ని తాగుతున్నారు. అయితే ఇది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వేడి టీ ప్లాస్టిక్ లో పోయడం వలన ఆ వేడికి మైక్రో ప్లాస్టిక్ కణాలు టీలో కలుస్తాయి . అలా అది మీ శరీరంలోకి వెళుతుంది. కావున ప్లాస్టిక్ బదులుగా సిరామిక్ కప్స్ లో టీ తాగడం మంచిది.

పునరుత్పత్తి….

side-effects-of-drinking-too-much-tea

ప్లాస్టిక్ కప్పులలో ఎక్కువగా టీీ తాగడం వలన మైక్రో ప్లాస్టిక్ కణాలు పేగుల్లో పేరుకుపోతాయి. మరి ముఖ్యంగా రోజులో రెండుసార్లు కంటే ఎక్కువ టీీ తాగేవారు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మైక్రో ప్లాస్టిక్ కణాలు క్యాన్సర్ కి దారితీసే అవకాశం ఉంది.ఇక ఇది ఇలానే కొనసాగితే మీ ఎండోక్రేన్ వ్యవస్థ దెబ్బతిని పునరుత్పత్తి వ్యవస్థకు ఆటంకం ఏర్పడుతుంది. కావున దీనిని ఎక్కువగా ప్లాస్టిక్ కప్పులలో తాగకూడదు.

టెంపరేచర్…

side-effects-of-drinking-too-much-tea

ప్రస్తుతం ప్రతి ఆఫీస్ లో ఏసీ అనేది సర్వసాధారణంగా మారింది. అయితే ఏసి రూమ్ లో కూర్చుని ఉంటున్నట్లయితే గోరువెచ్చని టీ తాగడం మంచిది.అలాగే బయట వాతావరణం దృష్టిలో పెట్టుకొని టీ తాగాలి. వాతావరణం వేడిగా ఉన్న సమయంలో టి ఎక్కువగా తాగితే అది డిహైడ్రేషన్ కు దారితీసే అవకాశం ఉంది.

నిద్రలేమి…

side-effects-of-drinking-too-much-tea

పని ఒత్తిడి వలన అలసటగా అనిపించినప్పుడు ప్రతి ఒక్కరూ కప్ టీ తాగుతారు. అయితే ఒక రోజులో రెండు సార్లు కంటే ఎక్కువ టీ తాగినట్లయితే నిద్రలేమి సమస్యలు రావడం పక్కా. ఎందుకంటే టీలో కెఫెన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం యాక్టివ్ గా ఉండేందుకు సహాయపడుతుంది. అందుకే దీనిని రోజులో రెండు కప్పులకు మించి తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే దీనిని ప్లాస్టిక్ లో అసలు తీసుకోకూడదని గుర్తుంచుకోండి.

గమనిక : ఈ కథనాన్ని ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ఆధారంగా రూపొందించాం. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.