Garlic Disadvantages : ఈ సమస్యలు ఉన్నవారు వెల్లుల్లి అసలు తినకూడదు…
Garlic Disadvantages : మన భారతీయ వంటకాల్లో వెల్లుల్లికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందరి ఇండ్లలో వెల్లుల్లిని సర్వసాధారణంగా వినియోగిస్తూ ఉంటారు. ఇక వెల్లుల్లితో ఉండే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు అని చెప్పాలి. ఎందుకంటే దీనిని ఆయుర్వేదంలో పలు రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి కూడా ఔషధంల ఉపయోగిస్తారు. అలాగే ఈ వెల్లుల్లితో ఎన్నో రోగాలకు చెక్ కూడా పెట్టవచ్చు. అలాగే జీర్ణక్రియ సమస్యలు, కొలెస్ట్రాల్ తగ్గించడం , క్యాన్సర్ , డయాబెటిస్ కంట్రోల్ , […]
Garlic Disadvantages : మన భారతీయ వంటకాల్లో వెల్లుల్లికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందరి ఇండ్లలో వెల్లుల్లిని సర్వసాధారణంగా వినియోగిస్తూ ఉంటారు. ఇక వెల్లుల్లితో ఉండే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు అని చెప్పాలి. ఎందుకంటే దీనిని ఆయుర్వేదంలో పలు రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి కూడా ఔషధంల ఉపయోగిస్తారు. అలాగే ఈ వెల్లుల్లితో ఎన్నో రోగాలకు చెక్ కూడా పెట్టవచ్చు. అలాగే జీర్ణక్రియ సమస్యలు, కొలెస్ట్రాల్ తగ్గించడం , క్యాన్సర్ , డయాబెటిస్ కంట్రోల్ , శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వెల్లుల్లితో కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్న వెల్లుల్లి అందరికీ మేలు చేస్తుంది అంటే అది పొరపాటు అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు వెల్లుల్లి తినకపోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అలాంటి సమస్యలు ఉన్నవారు వీలైనంతవరకు వెల్లుల్లికి దూరంగా ఉండటం మంచిది అని లేదంటే అలర్జీ భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏంటంటే… హైపటైటిస్ ఉన్నవారు వెల్లుల్లిని అసలు తినకూడదట. ఈ సమస్య ఉన్నవారు వెల్లుల్లి తింటే వికారం ,వాంతులు వంటి లక్షణాలు పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ఇక ఇది రక్తహీనతకు దారితీస్తుందని వారు తెలియజేశారు. అలాగే డయేరియా సమస్యలతో బాధపడే వారు వెల్లుల్లి అస్సలు తినకూడదట.అలాగే కంటి సంబంధిత వ్యాధులతో బాధపడేవారు సైతం వెల్లుల్లికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇక గర్భిణీ స్త్రీలు బాలింతలు కూడా వెల్లుల్లికి దూరంగా ఉండడం మంచిది. అలాగే రక్తపోటు సమస్య ఉన్నవారు చమట ఎక్కువగా పట్టేవారు కూడా వెల్లుల్లికి వీలైనంత దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.