Banana side effects : ఈ సమస్య ఉన్నవారు ఎక్కువగా అరటి పండ్లను తింటే లేని రోగం కొని తెచ్చుకున్నట్లే…జాగ్రత్త సుమీ..

Banana side effects  : అరటిపండును అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది తీయగా ఉండటమే కాకుండా అద్భుతమైన పోషకాలను కూడా కలిగి ఉంటుంది. అంతేకాక దీని ధర కూడా చాలా తక్కువగా ఉండడంతో ప్రజలు దీనిని ఎక్కువగా తింటుంటారు. అరటిపండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో మనందరికీీ తెలుసు. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు అరటి పండ్లకు చాలా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కాదంటే సమస్యను కొని తెచ్చుకున్నట్లే. అయితే […]

  • Published On:
Banana side effects : ఈ సమస్య ఉన్నవారు ఎక్కువగా అరటి పండ్లను తింటే లేని రోగం కొని తెచ్చుకున్నట్లే…జాగ్రత్త సుమీ..

Banana side effects  : అరటిపండును అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది తీయగా ఉండటమే కాకుండా అద్భుతమైన పోషకాలను కూడా కలిగి ఉంటుంది. అంతేకాక దీని ధర కూడా చాలా తక్కువగా ఉండడంతో ప్రజలు దీనిని ఎక్కువగా తింటుంటారు. అరటిపండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో మనందరికీీ తెలుసు. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు అరటి పండ్లకు చాలా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కాదంటే సమస్యను కొని తెచ్చుకున్నట్లే. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలో ఈరోజు తెలుసుకుందాం.

people-who-have-this-problem-must-do-not-eat-bananas

people-who-have-this-problem-must-do-not-eat-bananas

 

బ్లడ్ షుగర్…

అరటి పండ్లు చక్కెర అనేది ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మధుమేహం ఉన్న రోగులు దీనికి దూరంగా ఉండటం మంచిది. లేకుంటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో మీ సమస్యను మరింత పెంచుకున్న వాళ్ళు అవుతారు.

కిడ్నీ సమస్య…

అరటి పండులో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యతో బాధపడే వ్యక్తులకు చాలా హానికరం. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు అరటి పండ్లను ఎక్కువగా తినకూడదు.

మలబద్ధకం…

మనకు తెలిసిందే విరోచనాలు అయినప్పుడు అరటి పండ్లు ఎక్కువగా తింటే ఆ సమస్యను తగ్గిస్తుంది. కావున అపాన వాయువు మలబద్ధత సమస్యలు ఉన్నవారు అరటిపండ్లకు చాలా దూరంగా ఉండాలి. లేకుంటే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

అలర్జీ….

అరటిపండు అలర్జీని ఎక్కువ చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. కావున ఈ సమస్య ఉన్నవారు అరటి పండ్లకు పూర్తి దూరంగా ఉండాలి. లేకుంటే అనాఫిలాక్సీస్ వంటి తీవ్రమైన లక్షణాలు కలిగించే అవకాశం ఉంది.

ఆస్తమా..

ఆస్తమా రోగులు ఎక్కువగా అరటిపండు తినడం వల్ల వారి సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కావున ఈ సమస్యతో బాధపడేవారు అరటి పండ్లకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.