Yoga in Pregnancy : ఈ యోగాసనాలతో నార్మల్ డెలివరీ కన్ఫామ్…

Yoga in Pregnancy  : ప్రతి మహిళ జీవితంలో తల్లి కావడం అనేది ఒక మధురమైన అనుభూతి అని చెప్పాలి. ఇక ఈ సమయంలో అమ్మతనం పొందేందుకు ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తారు. అయితే స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు వారి శారీరక మరియు మానసిక పరమైన మార్పులు ఎన్నో చోటుచేసుకుంటాయి. అదేవిధంగా ఈ సమయంలో ఎక్కువ భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. అలాంటి సమయంలో గర్భిణీ స్త్రీలకు శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు వ్యాయామాలు ఎంతగానో మేలు […]

  • Published On:
Yoga in Pregnancy  : ఈ యోగాసనాలతో నార్మల్ డెలివరీ కన్ఫామ్…

Yoga in Pregnancy  : ప్రతి మహిళ జీవితంలో తల్లి కావడం అనేది ఒక మధురమైన అనుభూతి అని చెప్పాలి. ఇక ఈ సమయంలో అమ్మతనం పొందేందుకు ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తారు. అయితే స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు వారి శారీరక మరియు మానసిక పరమైన మార్పులు ఎన్నో చోటుచేసుకుంటాయి. అదేవిధంగా ఈ సమయంలో ఎక్కువ భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. అలాంటి సమయంలో గర్భిణీ స్త్రీలకు శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు వ్యాయామాలు ఎంతగానో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. అయితే గర్భవతిగా ఉన్న స్త్రీలు ఒకటి రెండు వ్యాయామాలు చేయడం వలన పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుండి ప్రతిరోజు నిర్ణిత సమయంలో కొన్ని వ్యాయామాలు చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అధ్యయనాలు తేల్చి చెప్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే యోగాసనాలు గర్భవతి సమయంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే వెన్న నొప్పి ,వాపు, నిద్రలేమి వంటి సమస్యలను దూరం చేయడానికి సహాయ పడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ వ్యాయామాలను చేయడం ద్వారా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ లు కూడా ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

వృక్షాసనం….

normal-delivery-conforms-with-these-yogasanas

నార్మల్ డెలివరీ కావాలంటే కటి వాలయం పిరుదుల్లోని కండరాలు దృఢంగా , ఫ్లెక్సీబుల్ గా మారడం ఎంతో ముఖ్యం. దానికోసం వృక్షాసనం ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా మానసిక ప్రశాంతతకు శరీరం బాలన్స్ అవ్వడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

ఉష్ణాసనం…

normal-delivery-conforms-with-these-yogasanas

మహిళలు ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో ఈ ఆసనాన్ని చేసినట్లయితే వెన్నెముకకు మంచి సపోర్ట్ లభిస్తుంది. అలాగే భుజాలు చాతి పిరుదులు చాలా ఫ్లెక్సిబుల్ గా తయారవుతాయి. తద్వారా డెలివరీ సమయంలో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

వీరభద్రాసనం…

normal-delivery-conforms-with-these-yogasanas

ఈ ఆసనాన్ని రోజు ప్రాక్టీస్ చేయడం వలన కటివాలయంలోని కండరాలకు చక్కటి వ్యాయామం అందినట్లు అవుతుంది. దీని కారణంగా డెలివరీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా నార్మల్ డెలివరీ అవుతుంది.

సూర్య నమస్కారాలు…

normal-delivery-conforms-with-these-yogasanas

ఈ వ్యాయామం వీపు మరియు శరీరంలోని కండరాలను దృఢంగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా రక్తంలోని చక్కెర స్థాయిలని తగ్గించి రక్త ప్రసరణ క్రమబద్ధీకరించి జీవక్రియలు వేగంగా పనిచేసేలా చేస్తుంది. అయితే ఈ వ్యాయామం చేసే సమయంలో సాధారణంగా శ్వాస తీసుకుంటూ ఒక్కో భంగిమలో దాదాపు పది సెకండ్ల పాటు ఉండటం మంచిది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.