Night Shifts : నైట్ షిఫ్ట్ చేసేవారు ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి…

Night Shifts : ఒకప్పుడు ఉద్యోగం అంటే ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు వినూత్నంగా ఆలోచించి 24/7 షిఫ్ట్ వారీగా వర్క్ చేపిస్తున్నారు. ప్రస్తుతం చాలా రంగాలలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇతర షిఫ్ట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ నైట్ షిఫ్ట్ అంటే మాత్రం సమస్యలు తలెత్తుతుంటాయి. దీనిలో ప్రధానమైనది ఆరోగ్య సమస్యలు అని చెప్పాలి. నైట్ షిఫ్ట్ లో పనిచేయడం వలన నిద్ర లేకపోవడం […]

  • Published On:
Night Shifts : నైట్ షిఫ్ట్ చేసేవారు ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి…

Night Shifts : ఒకప్పుడు ఉద్యోగం అంటే ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు వినూత్నంగా ఆలోచించి 24/7 షిఫ్ట్ వారీగా వర్క్ చేపిస్తున్నారు. ప్రస్తుతం చాలా రంగాలలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇతర షిఫ్ట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ నైట్ షిఫ్ట్ అంటే మాత్రం సమస్యలు తలెత్తుతుంటాయి. దీనిలో ప్రధానమైనది ఆరోగ్య సమస్యలు అని చెప్పాలి. నైట్ షిఫ్ట్ లో పనిచేయడం వలన నిద్ర లేకపోవడం డయాబెటిస్ అధిక బరువు జీర్ణకోశ సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి నైట్ షిఫ్ట్ లో పనిచేసేవారు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

టైం మేనేజ్మెంట్….

నైట్ షిఫ్ట్ లో పనిచేసేవారు ఒక టైం టేబుల్ రూపొందించుకోవడం మంచిది. దీని ద్వారా మీరు చేయాలనుకున్న పనులను అనతికాలంలో పూర్తిచేసుకుని విశ్రాంతి తీసుకోవచ్చు.

తగినంత నిద్ర….

నైట్ షిఫ్ట్ చేసేవారు కచ్చితంగా పగటి సమయంలో తగినంత నిద్రపోవడం మంచిది. నిద్ర లేకపోవడం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్రలేమి వలన బలహీనంగా కూడా మారతారు. అందుకే రాత్రివేళ చురుగ్గా పని చేయాలంటే పగటిపూట తగినంత నిద్రపోవడం మంచిది. కావున పగటిపూట నిద్రపోవాలనుకునే వారు ప్రశాంతమైన వాతావరణంలో నిద్రించడం వలన ప్రశాంతమైన నిద్ర పొందవచ్చు. తద్వారా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి…

సాధారణంగా నైట్ షిఫ్ట్ లో పనిచేసే వారు ఎసిడిటి వంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు. ఇవి ఊబకాయం తదితర సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి రాత్రి సమయంలో సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అంటే వేయించిన ఆహారాలను కాకుండా తేలికపాటి ఆహారాలను తీసుకోవడం వలన సులువుగా జీర్ణం అవుతుంది. అదేవిధంగా నైట్ షిఫ్ట్ లో పనిచేసే వారు ఎక్కువగా పండ్లు తీసుకోవడం వలన మరింత ఉత్సాహంగా పని చేయగలుగుతారు.

వ్యాయామం…

నైస్ షిఫ్ట్ లో పనిచేసేవారు ప్రతిరోజు ఉదయాన్నే వ్యాయామం చేసుకోవడం చాలా ముఖ్యం. టైం సెట్ చేసుకుని కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వలన మరింత ఎనర్జీని పొందుతారు. అదేవిధంగా నైట్ షిఫ్ట్ లో పనిచేయడం వలన శారీరక శ్రమ కూడా తగ్గుతుంది. అదేవిధంగా తగిన మోతాదులో నీరు తీసుకోవడం చాలా ముఖ్యం.