Leg Cramps : నిద్రలో కాళ్లు తిమ్మిర్లు పడుతున్నాయా…కారణం ఇదే…

Leg Cramps : చాలామందికి రాత్రి పడుకునే సమయంలో కాలు తిమ్మిర్లు వస్తుంటాయి. ఇక ఈ సమస్య కారణంగా నిద్ర కూడా సరిగా పట్టదు. అయితే ఈ సమస్య వచ్చినప్పుడు చాలా మంది దీనిని ఏం కాదులే అని లైట్ తీసుకుంటారు. ఈరోజు బాగా నడిచి వచ్చాం కదా అందుకే ఇలా జరిగి ఉంటుందని అనుకుంటారు. మరి కొంతమంది శరీరంలో వేడి ఎక్కువైందిలే అని అదే తగ్గిపోతుంది అనుకుని అలవాటు పడుతుంటారు. అలా వదిలేయడం వలన అసలు […]

  • Published On:
Leg Cramps : నిద్రలో కాళ్లు తిమ్మిర్లు పడుతున్నాయా…కారణం ఇదే…

Leg Cramps : చాలామందికి రాత్రి పడుకునే సమయంలో కాలు తిమ్మిర్లు వస్తుంటాయి. ఇక ఈ సమస్య కారణంగా నిద్ర కూడా సరిగా పట్టదు. అయితే ఈ సమస్య వచ్చినప్పుడు చాలా మంది దీనిని ఏం కాదులే అని లైట్ తీసుకుంటారు. ఈరోజు బాగా నడిచి వచ్చాం కదా అందుకే ఇలా జరిగి ఉంటుందని అనుకుంటారు. మరి కొంతమంది శరీరంలో వేడి ఎక్కువైందిలే అని అదే తగ్గిపోతుంది అనుకుని అలవాటు పడుతుంటారు. అలా వదిలేయడం వలన అసలు సమస్య మొదలైంది అని చెప్పాలి. ఎందుకంటే కాళ్లు తిమ్మిర్ల సమస్యలను నిర్లక్ష్యంం చేయడం వలన భవిష్యత్తులో పెద్ద సమస్యల వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ముందుగా అప్రమత్తమై తగిన చికిత్స తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. అయితే అసలు కాళ్ళల్లో ఎమ్మిర్లు వెనక ఉంటే కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కాల తిమ్మిర్లు ఎందుకు వస్తాయంటే….

ఈ సమస్య అనేక కారణాల వలన వస్తుంది. ఇక దీనిలో చూస్తే శరీరంలో తగినంత పోషకాలు లేకపోవడం , కండరాలు సమస్య , రెస్ట్ లెస్ లెగ్ సిండ్రామ్, దీర్ఘకాలిక వ్యాధులు కళ్ళ తిమ్మిర్లకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. అంతేకాక శరీరంలో కొన్ని విటమిన్స్ లోపించడం మరో కారణమని స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ ఆ విటమిన్లు ఏంటంటే…

విటమిన్ డి…

అయితే రాత్రిపూట కాళ్ల తిమ్మిర్లు వంటి సమస్యలు విటమిన్ డి లోపం వలన కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో విటమిన్ డీ లోపం ఉండడం వలన అది నేరుగా ఎముకలను ప్రభావితం చేస్తుంది. తద్వారా ఎముకలు బలహీనంగా మారుతాయి. అలాగే నరాల సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా సన్నగిల్లుతుంది. అందుకే విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి ప్రతిరోజు ఉదయం సూర్యకాంతిలో కాసేపు గడపడం మంచిది. అదేవిధంగా విటమిన్ డీ లభించే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

విటమిన్ బి.

శరీరంలో విటమిన్ బి లోపించడం వలన రెస్ట్ లిస్ లెగ్ ,  వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. కాబట్టి విటమిన్ డి లోపాన్ని తగ్గించుకునేందుకు ఆహారంలో ఆపిల్ ,ఆరెంజ్, కివి, పెరుగు ,జున్ను ,అరటిపండు , బఠానీ వంటి మొదలైన ఆహారాలను చేర్చుకోవాలి . మాంసాహారులు చికెన్ సాల్మన్, ఫిష్ ఎక్కువగా తీసుకోవడం మంచిది.

కాల్షియం…

శరీరంలో కాల్షియం లోపం వలన కూడా రాత్రి నిద్రిస్తున్న సమయంలో కాళ్లు తిమ్మిర్లు వస్తుంటాయి.అలాగే కండరాల సమస్యలు నాడీ వ్యవస్థ సమస్యలుఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీనిని నివారించడానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో లభించే సమాచారం ఆధారంగా రూపోందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.