Tea : ఈ నాలుగు విషయాలు గుర్తు పెట్టుకుంటే టీ టెస్ట్ అదుర్స్….

Tea  : మన భారతదేశంలో టీకి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు ఎంతో అమితంగా ఈ టీ ను ఆస్వాదిస్తున్నారు. అంతేకాక టీ తాగకుండా చాలామంది ఏ పని మొదలు పెట్టరు. ఇక ఈ టీ తాగి పనిచేయటం వలన చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా వారి పనిని పూర్తి చేస్తారు . అయితే ఈ టీ ప్రతిసారి ఒకే రుచి రావాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. మరి […]

  • Published On:
Tea : ఈ నాలుగు విషయాలు గుర్తు పెట్టుకుంటే టీ టెస్ట్ అదుర్స్….

Tea  : మన భారతదేశంలో టీకి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు ఎంతో అమితంగా ఈ టీ ను ఆస్వాదిస్తున్నారు. అంతేకాక టీ తాగకుండా చాలామంది ఏ పని మొదలు పెట్టరు. ఇక ఈ టీ తాగి పనిచేయటం వలన చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా వారి పనిని పూర్తి చేస్తారు . అయితే ఈ టీ ప్రతిసారి ఒకే రుచి రావాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ప్రతిరోజు నీళ్ల తర్వాత ఎక్కువగా తాగేది ఏదైనా ఉంది అంటే అది టీ అనే చెప్పాలి. అలాంటి టీ ఎన్నిసార్లు చేసినా ఒకే రుచి రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి.

if-you-remember-these-four-things-the-tea-test-will-increase

అయితే ప్రస్తుత కాలంలో చాలామంది మసాలా టీ ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకుని దాంట్లో సరిపడిన వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. అయితే మీరు రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నట్లయితే రెండు టేబుల్ స్పూన్స్ టీ పొడి వేయాల్సి ఉంటుంది. మీరు ఏ రకం టీ పొడిని వినియోగించిన సరే రెండు గ్లాసుల వాటర్ కు రెండు టీ స్పూన్స్ వెయ్యండి. అలాగే రెండు స్పూన్ల పంచదార కూడా కలపండి. ఒకవేళ మీరు తీపి ఎక్కువగా తీసుకునే వారైతే మరికొంత ఆడ్ చేసుకోండి. అయితే టీ మరుగుతుండగా ఒక రెండు యాలకులను తీసుకొని దంచి టీలో వేసుకోవాలి.

if-you-remember-these-four-things-the-tea-test-will-increase

ఇక వాటర్ కలర్ చేంజ్ అయ్యేంతవరకు బాగా మరిగించాలి. అనంతరం రెండు గ్లాసుల పాలు పోసుకుని బాగా మరిగించుకోవాలి. ఇక్కడ మనం రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల పాలు తీసుకున్నాం. అయితే చాలామంది ఫ్రిజ్ లో నుంచి తీసిన వెంటనే పాలను టీలో పొస్తుంటారు. అలా అస్సలు చేయకండి. టీ పెట్టాలనుకున్నప్పుడు అరగంట ముందే పాలు బయట పెట్టుకొని టీలో పోసుకోవాలి. అప్పుడు ఆ పాలు విరిగిపోకుండా ఉంటుంది. అలాగే గరిటతో అప్పుడప్పుడు టీ ని కలుపుతూ మరగబెట్టుకోవాలి. ఇలా దాదాపు ఒక పది నిమిషాల పాటు చేసినట్లయితే ఎంతో రుచికరమైన టి తయారవుతుంది. ఇక ఈ పద్ధతి లో ఎన్నిసార్లు చేసినా ఒకే రుచి వస్తుంది.