Nipah Virus – Symptoms : ఈ లక్షణాలు ఉంటే నిఫ్ఫా వైరస్ వచ్చినట్లే…

Nipah Virus – Symptoms  : కరోనా మహమ్మారి మొదలైనప్పుడు చాలామంది దాన్ని చాలా తేలికగా తీసుకున్నారు. కానీ చివరికి అది ప్రపంచాన్ని ఎంతలా గడగడలాడించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక దాని జ్ఞాపకాలను పూర్తిగా మరవకముందే మరో కొత్త వైరస్ కేరళలో అడుగు పెట్టింది. ప్రస్తుతం ఇది కేరళ రాష్ట్రాన్ని వ వణికిస్తుంది. ఇక ఈ వైరస్ కోవిడ్ కంటే కూడా మరింత ప్రమాదకరమైందని కథనాలు వినిపిస్తున్నాయి. అయితే కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం గుబులు పుట్టిస్తున్న […]

  • Published On:
Nipah Virus – Symptoms : ఈ లక్షణాలు ఉంటే నిఫ్ఫా వైరస్ వచ్చినట్లే…

Nipah Virus – Symptoms  : కరోనా మహమ్మారి మొదలైనప్పుడు చాలామంది దాన్ని చాలా తేలికగా తీసుకున్నారు. కానీ చివరికి అది ప్రపంచాన్ని ఎంతలా గడగడలాడించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక దాని జ్ఞాపకాలను పూర్తిగా మరవకముందే మరో కొత్త వైరస్ కేరళలో అడుగు పెట్టింది. ప్రస్తుతం ఇది కేరళ రాష్ట్రాన్ని వ వణికిస్తుంది. ఇక ఈ వైరస్ కోవిడ్ కంటే కూడా మరింత ప్రమాదకరమైందని కథనాలు వినిపిస్తున్నాయి. అయితే కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం గుబులు పుట్టిస్తున్న ఆ వైరస్ పేరే నిఫా వైరస్… కేరళ రాష్ట్రంలో ఇప్పటికే ఈ వైరస్ పై 6 కేసులు వెలుగులోకి వచ్చాయి.ఇక అందులో ఇప్పటికే ఇద్దరు మరణించారు. అయితే ఈ వైరస్ గబ్బిలాలు , పందుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. అనంతరం మనిషి నుండి మనిషికి వ్యాపిస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఈ నిఫా వైరస్ కు సరైన చికిత్స లేకపోవడం ఆందోళన కలిగించే విషయం.

నిఫా వైరస్ లక్షణాలు……..

if-you-have-these-symptoms-its-like-nipha-virus

నిఫ్ఫా వైరస్ బారిన పడినవారు తీవ్రమైన శ్వాసకోసా అనారోగ్యం ప్రాణాంతకర ఎన్సిపాలిటీస్ వంటి సమస్యలు ఎదురవుతాయట. అయితే ఈ వైరస్ జంతువులను కూడా తీవ్ర వ్యాధికి గురిచేస్తుంది. తద్వారా జంతువుల నుండి మనుషులకి వ్యాప్తి చెందుతుంది. అయితే మొదట్లో ఈ వైరస్ సోకిన వారు జ్వరం తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు ,వికారం , గొంతు నొప్పి వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. కాగా నిఫ్ఫా వైరస్ నియంత్రణకు కేరళ ప్రభుత్వం 19 కోర్ కమిటీలను ఏర్పాటు చేసింది.

వైరస్ బారిన పడి ఐసోలేషన్ లో ఉన్నవారికి స్థానిక ప్రభుత్వం ద్వారా వాలంటీర్ బృందాల ను ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి కేరళలో ఇద్దరు ప్రాణాలు విడిచారు. దీంతో కేరళ లోని కోజికోడు జిల్లాలోని 7 పంచాయతీలను ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్స్ గా ప్రకటించింది. ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతానికి చెందిన బ్యాంకులు ,పాఠశాలలు మరియు ఇతర విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అయితే ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన నిఫా వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్ గా కేరళ ప్రభుత్వం గుర్తించింది.