Karakkaya Health Benefits : కరక్కాయ ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం…
Karakkaya Health Benefits : మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆయుర్వేదం కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక ఆయుర్వేదంలో త్రీఫల చూర్ణానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దంతాల నుండి జీర్ణ సమస్యల వరకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే గొప్ప ఔషధమని చెబుతుంటారు. అయితే అసలు త్రిఫల చూర్ణం అంటే ఏంటి…?దానిలో ఉండే పోషకాలు ఏంటి…?కరక్కాయ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్రిఫల […]
Karakkaya Health Benefits : మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆయుర్వేదం కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక ఆయుర్వేదంలో త్రీఫల చూర్ణానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దంతాల నుండి జీర్ణ సమస్యల వరకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే గొప్ప ఔషధమని చెబుతుంటారు. అయితే అసలు త్రిఫల చూర్ణం అంటే ఏంటి…?దానిలో ఉండే పోషకాలు ఏంటి…?కరక్కాయ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
త్రిఫల చూర్ణం..
త్రీఫల చూర్ణం అంటే మూడు ఫలాలతో తయారయ్యే చూర్ణం అని అర్థం.అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇక దీనిలో ఉపయోగించే మూడు ఫలాలు ఉసిరి థానికాయ, కరక్కాయ . ఇక ఈ త్రీఫల చూర్ణానికి ఆయుర్వేదంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ త్రీఫల చూర్ణం వలన వాత, పిత్త, కఫ , దోషాలను తొలగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ , యాంటీ ఇంప్లిమెంటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దీనిలో పుష్కలంగా లభిస్తాయి. అయితే త్రిఫల చూర్ణంలో ఉపయోగించే మూడు ఫలాల్లో ఒకటైన కరక్కాయల లో దాగిన ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కరక్కాయ…
కరక్కాయ శాస్త్రీయ నామం టెర్మినాలియా చేబుల్లా. ఇక ఈ కరక్కాయ చాలా విలువైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనిలో యాంత్రాక్వినోన్లు ,టానిన్లు , చేబ్యూలిక్ ఆమ్లం ,రేసిన్ ,స్థిర తైలం మొదలైనవి ఎక్కువగా ఉంటాయి. ఇక ఇది అన్ని రకాల జీర్ణకోశ వ్యాధులను ,ఆస్తమా ,దగ్గు , వాంతులు , కంటి వ్యాధులు , గుండె జబ్బుల నివారణకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాక ఇవి మలబద్దక సమస్యను కూడా నివారిస్తాయి.
చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది….
ప్రస్తుత కాలంలో చిన్న ల నుంచి పెద్దల వరకు చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య షుగర్ వ్యాధి. ఈ సమస్యతో బాధపడే వారికి కరక్కాయ ఒక వరం అని చెప్పాలి.దీనిని తీసుకోవటం వలన ఇన్సులిన్ స్రవించడానికి , ప్యాంక్రి యాటిక్ బీటా ను యాక్టివేట్ చేస్తుంది. అలాగే ఇన్సులిన్ ను నియంత్రిస్తుంది. అలాగే 2017 లో జంతువులపై జరిగిన ఒక అధ్యయనం ప్రకారం కరక్కాయ రక్తం లోని చక్కర స్థాయిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని రుజువైంది. కావున షుగర్ వ్యాధితో బాధపడే వారికి కరక్కాయ ఒక వరంగా భావిస్తారు.
జుట్టుకు మేలు…
ప్రస్తుత కాలంలో విపరీతంగా పెరుగుతున్న పొల్యూషన్ మరియు మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది జుట్టు రాలే సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు చిట్లిపోవడం, పొడిబారడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సమస్యలతో బాధపడే వారికి పరిష్కారం అంటే కరక్కాయ అని చెప్పవచ్చు . కరక్కాయ ఆకులు చుండ్రు మరియు జుట్టు రాలడు సమస్యను వెంటనే తగ్గిస్తాయి. దీనిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలకు ఎంతగానో దోహదపడతాయి.
చర్మాన్ని రక్షిస్తుంది…
చర్మ సమస్యలతో బాధపడేవారు కరక్కాయని ఉపయోగించడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియా మరియు యాంటీ ఆక్సిడెంట్ చర్మం నాణ్యత దెబ్బతినకుండా కాపాడుతాయి. అదేవిధంగా మొటిమలు, మచ్చలు , దద్దుర్లు వంటి చర్మ వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయి.
కళ్లకు మంచిది…
కరక్కాయ కళ్ళకు ప్రయోజనకారి అని చెప్పవచ్చు. కళ్ళ మంట , కళ్ళు పొడి బారడం, కండ్ల కలక వంటి సమస్యలు నయం చేయడానికి కరక్కాయ ఎంతగానో ఉపయోగపడుతుంది.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.