Health Care : ఉసిరితో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో మీరే చూడండి…రోజు ఇది ఒక్కటి తింటే చాలట…

Health Care : విటమిన్ పేరుతో రోజు కో టాబ్లెట్ వేసుకోవడం కంటే ప్రతిరోజు ఉసిరికాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉసిరికాయను పచ్చిగా తినలేకపోతే అన్నంలో లేదా వంటలో ఆమ్లా పౌడర్ గా దీనిని ఉపయోగించవచ్చు. మరి ముఖ్యంగా ఉసిరి జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.అంతేకాక జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. దీంతోపాటు చుండ్రు మరియు జుట్టు రంగు మారడాన్ని కూడా అరికడుతుంది. అయితే ఉసిరికాయను రసం చేసుకొని తీసుకోవడం […]

  • Published On:
Health Care : ఉసిరితో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో మీరే చూడండి…రోజు ఇది ఒక్కటి తింటే చాలట…

Health Care : విటమిన్ పేరుతో రోజు కో టాబ్లెట్ వేసుకోవడం కంటే ప్రతిరోజు ఉసిరికాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉసిరికాయను పచ్చిగా తినలేకపోతే అన్నంలో లేదా వంటలో ఆమ్లా పౌడర్ గా దీనిని ఉపయోగించవచ్చు. మరి ముఖ్యంగా ఉసిరి జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.అంతేకాక జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. దీంతోపాటు చుండ్రు మరియు జుట్టు రంగు మారడాన్ని కూడా అరికడుతుంది. అయితే ఉసిరికాయను రసం చేసుకొని తీసుకోవడం వలన శరీరానికి చాలా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

health-benefits-of-amla-just-one-a-day-is-enough

 

ఉసిరికాయ రసం..

మలబద్ధకం పైల్స్ లాంటి సమస్యలు ఉన్నవారికి ఉసిరికాయ రసం ఎంతగానో మేలును కలుగజేస్తుంది. అంతేకాక కడుపునొప్పి ,అజీర్తి వంటి సమస్యలను నివారిస్తుంది. అలాగే ఒక గ్లాస్ పాలు లేదా నీటిలో కొంచెం ఉసిరి పొడి కొంచెం చక్కెరను కలిపి ప్రతి రోజు రెండుసార్లు తీసుకోవడం వలన అసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి . అలాగే ఉసిరి పొడిని గ్లాస్ నీటిలో నానబెట్టి తాగితే జీర్ణ క్రియ సాఫీగా జరుగుతుంది. అలాగే ఉసిరి రసంలో ప్రతిరోజు కొంచెం తేనెను కలుపుకొని తాగడం వలన చర్మంపై నల్లని మచ్చలు పోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.  అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికి ఉసిరి రసం ఎంతగానో సహాయపడుతుంది.

health-benefits-of-amla-just-one-a-day-is-enough

 

అలాగే ఉసిరి రసం కంటి చూపును మెరుగుపరచడంలో మరియు కంటి దురద , కళ్ళల్లో నీరు రావడం వంటి కళ్ళ సమస్యలను కూడా నయం చేసి కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. అంతేకాక ప్రతిరోజు ఈ రసం తీసుకోవడం వలన నోటి దుర్వాసన తొలగి దంతాలు దృఢంగా తయారవుతాయి. ఉసిరికాయ కు ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచే గుణం ఉంటుంది.దీనివలన దంతాలు మరియు గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాక దగ్గు, కడుపునొప్పి, రక్తహీనత వంటి సమస్యల నుండి బయటపడేస్తుంది. అలాగే రక్తంలోనే చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉసిరి చాలా బాగా సహాయపడుతుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రాయడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.