Health tips : లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పండ్లు….అంగస్తంభన సమస్యకు చెక్…..

Health tips : బ్లాక్ కరెంట్స్…వీటిని కాసిస్ పండ్లు అని కూడా పిలుస్తుంటారు. మరికొందరు వీటిని నల్ల ద్రాక్ష అని కూడా అంటారు. వాస్తవానికి నల్ల ద్రాక్ష మరియు బ్లాక్ కరెంట్స్ వేరువేరు రకాల పండ్లు. కాని చూడడానికి అచ్చం నల్ల ద్రాక్షల కనిపించడంతో వీటిని కొందరు నల్ల ద్రాక్ష అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ బ్లాక్ కరెంట్స్ తో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. బ్రిటన్ లో చాలామంది వీటిని ఎక్కువగా తింటుంటారు. ప్రస్తుతం […]

  • Published On:
Health tips : లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పండ్లు….అంగస్తంభన సమస్యకు చెక్…..

Health tips : బ్లాక్ కరెంట్స్…వీటిని కాసిస్ పండ్లు అని కూడా పిలుస్తుంటారు. మరికొందరు వీటిని నల్ల ద్రాక్ష అని కూడా అంటారు. వాస్తవానికి నల్ల ద్రాక్ష మరియు బ్లాక్ కరెంట్స్ వేరువేరు రకాల పండ్లు. కాని చూడడానికి అచ్చం నల్ల ద్రాక్షల కనిపించడంతో వీటిని కొందరు నల్ల ద్రాక్ష అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ బ్లాక్ కరెంట్స్ తో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. బ్రిటన్ లో చాలామంది వీటిని ఎక్కువగా తింటుంటారు. ప్రస్తుతం ఇవి భారతదేశపు మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక దీనిలో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాక ఇవి లైంగిక సమస్యలను దూరం చేయడంలో చాలా బాగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. వీటి ద్వారా భవిష్యత్తులో కొన్ని రకాల ఔషధాలను కూడా తయారు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

fruits-that-improve-sexual-health-check-for-erectile-dysfunction

ఈ పండ్లపై ఇప్పటికే చాలా రకాల పరిశోధనలు కూడా జరిగాయి.  అయితే ఇది లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదా అనే అంశంపై కూడా పరిశోధనలు జరిగాయి. ఇక ఆ పరిశోధన గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం….పురుషులలోని అంగస్తంభన సమస్యను తగ్గించేందుకు ఈ బ్లాక్ కరెంట్స్ సహాయపడతాయా లేదా అన్న అంశంపై బెల్ పాస్ట్ లోని క్వీన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎడిన్ క్యాసిడి ఓ పరిశోధన చేపట్టారు. అంగస్తంభన సమస్యను ఎదుర్కునే వారికి రక్త సరఫరా సరిగా జరగదు. ఈ సమస్యకు బ్లాక్ కరెంట్స్ పండ్లలోని ఆంథోసయనిన్లుతోపాటు కొన్ని ప్లేవనాడులు పరిష్కారం చూపగలమని ఆమె కనుగొన్నారు. ఈ పండ్లను తినడం వలన రక్తనాళాలు కాస్త తెరచుకుని రక్త సరఫరా మెరుగవుతుందట.

fruits-that-improve-sexual-health-check-for-erectile-dysfunction

తద్వారా అంగస్తంభన సమస్య ను తగ్గించుకోవచ్చని ఆమె తెలియజేశారు. అయితే ఈ ప్రయోగంలో భాగంగా ప్రొఫెసర్ ఎడిన్ క్యాసిడి 25వేల మంది పురుషుల ఆరోగ్యాన్ని దాదాపుగా పదేళ్లపాటు గమనించారట. ఈ ప్రయోగం తర్వాత ఆమె నిర్ధారించుకున్నదేంటంటే… సాధారణ పురుషులతో పోలిస్తే వారంలో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు బ్లాక్ కరెంట్స్ పండ్లను తీసుకునే వారిలో ఈ అంగస్తంభన సమస్య 19 శాతం తక్కువగా ఉందట. సాధారణ వారితో పోలిస్తే ఈ పండ్లను తినేవారికి హెరెక్టైల్ డిస్ ఫంక్షన్ సమస్య వచ్చే అవకాశం 19 శాతం కంటే తక్కువగా ఉంటుందని ఆమె వివరించారు. అయితే ఈ పండ్లు ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పండ్లను తీసుకునే ముందు మీ ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని , డాక్టర్ ను సంప్రదించిన తర్వాత తీసుకోవడం మంచిది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు