Heart Health : గుండె ఆరోగ్యం కోసమైనా ప్రతిరోజు ఈ ఆహారాలను తినండి…..

Heart Health : పనిచేస్తున్నంత వరకు గుండె గురించి మనం పెద్దగా పట్టించుకోము. ఎప్పుడైనా మొరాయిస్తే మాత్రం ముందే జాగ్రత్త పడి ఉంటే బాగుండేది కదా అనుకుంటాం…అయితే పరిస్థితి అంతవరకు రాకుండా ఉండాలంటే గుండె ఆరోగ్యాన్ని 10 కాలాలపాటు పదిలంగా ఉంచుకోవాలంటే మంచి ఆహారపు అలవాట్లను పాటించడం మంచి పరిష్కారమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రోజువారి ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం వలన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అయితే ఆ ఆహారాలు ఏంటో […]

  • Published On:
Heart Health  : గుండె ఆరోగ్యం కోసమైనా ప్రతిరోజు ఈ ఆహారాలను తినండి…..

Heart Health : పనిచేస్తున్నంత వరకు గుండె గురించి మనం పెద్దగా పట్టించుకోము. ఎప్పుడైనా మొరాయిస్తే మాత్రం ముందే జాగ్రత్త పడి ఉంటే బాగుండేది కదా అనుకుంటాం…అయితే పరిస్థితి అంతవరకు రాకుండా ఉండాలంటే గుండె ఆరోగ్యాన్ని 10 కాలాలపాటు పదిలంగా ఉంచుకోవాలంటే మంచి ఆహారపు అలవాట్లను పాటించడం మంచి పరిష్కారమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రోజువారి ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం వలన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అయితే ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పెరుగు మజ్జిగ…

veat-these-foods-every-day-for-heart-health

పెరుగు గుండెకు ఎంతగానో మేలును కలుగజేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచే పొటాషియం, మెగ్నీషియం కాల్షియం మరియు ఖనిజలవణాలు పెరుగులో సమృద్ధిగా లభిస్తాయి.అధిక రక్తపోటు వలన రక్తనాళాలు కుచించుకుపోయి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది అన్న విషయం తెలిసిందే.కాబట్టి పెరుగు మజ్జిగను రోజువారి ఆహారంలో తీసుకోవడం వలన ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

వాల్ నట్స్…..

eat-these-foods-every-day-for-heart-health

వాల్ నట్స్ కూడా గుండె ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. వాల్ నట్స్ లో ఫైటో కెమికల్స్ అలాగే గుండెకు మేలు చేసే ఆరోగ్యకర కొవ్వులు మరియు పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక వాల్ నట్స్ లో సోడియం శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓ అధ్యయనం ప్రకారం ప్రతిరోజు అరకప్ వాల్ నట్స్ తినే వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతున్నాయని రుజువైనది. అయితే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గితే రక్తనాళం లోని అడ్డంకులు తగ్గుతాయి. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

చిక్కుడు….

eat-these-foods-every-day-for-heart-health

గుండె కు మేలు చేసే ఆహారాలలో చిక్కుడు కూడా ఒకటి. దీనిలో ఉండే పొటాషియం పైటో కెమికల్స్ మరియు రెండు రకాల పీచు పదార్థాలు గుండె ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నీటిలో సులభంగా కరిగె పీచు రక్తంలో కొలెస్ట్రాలను అదుపులో ఉంచుతుంది. అలాగే శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన శరీరంలోని కొలెస్ట్రాల్ మరియు బరువు ఆరోగ్యంగా ఉన్నట్లయితే గుండె కూడా ఆరోగ్యంగా ఉన్నట్లే ..

చేపలు…..

eat-these-foods-every-day-for-heart-health

గుండె ఆరోగ్యంగా ఉండడం కోసం తరచుగా చేపలు తినడం కూడా అలవాటు చేసుకోవాలి. మరి ముఖ్యంగా సముద్రపు చేపలను తింటే ఇంకా మంచిది. ఎందుకంటే సముద్రపు చేపలలో హానికర కొవ్వు శాతం చాలాలా తక్కువగా ఉంటుంది. మేలు చేసే హొమేగా 3 కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. రక్తపోటును తగ్గించడానికి రక్తనాళాలలో ఇబ్బందులను తగ్గించడానికి హోమేగా 3 కొవ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి.
ఇక గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీటితోపాటు ప్రతిరోజు ఆకుకూరలు తినడం చాలా ముఖ్యం.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది.తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.