Health Tips : మీరు ఓవెన్లను వినియోగిస్తున్నారా…అయితే ఈ వస్తువులను దానిలో అసలు వేడి చేయకండి…

Health Tips : ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుకుల జీవితంలో చాలామంది మైక్రో ఓవెన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. తద్వారా అతి తక్కువ సమయంలోనే అనేక రకాల వంటలను వండుకోగలుగుతున్నారు. అదేవిధంగా క్షణాల్లోనే ఆహార పదార్థాలను దీని ద్వారా వేడి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ మైక్రో ఓవెన్ లో ఆహార పదార్థాలను కుకింగ్ లేదా వేడి చేసేటప్పుడు ఉపయోగించే కంటైనర్స్ ను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలని లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు […]

  • Published On:
Health Tips :  మీరు ఓవెన్లను వినియోగిస్తున్నారా…అయితే ఈ వస్తువులను దానిలో అసలు వేడి చేయకండి…

Health Tips : ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుకుల జీవితంలో చాలామంది మైక్రో ఓవెన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. తద్వారా అతి తక్కువ సమయంలోనే అనేక రకాల వంటలను వండుకోగలుగుతున్నారు. అదేవిధంగా క్షణాల్లోనే ఆహార పదార్థాలను దీని ద్వారా వేడి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ మైక్రో ఓవెన్ లో ఆహార పదార్థాలను కుకింగ్ లేదా వేడి చేసేటప్పుడు ఉపయోగించే కంటైనర్స్ ను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలని లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ముఖ్యంగా కొన్ని వస్తువులను ఓవెన్ లో ఎప్పుడు వేడి చేయకూడదని సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్లాస్టిక్ కంటైనర్స్…

do-you-use-ovens-but-dont-actually-heat-these-things-in-it

ప్లాస్టిక్ కంటైనర్స్ మైక్రో ఓవెన్ లో అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే మైక్రో ఓవెన్ లోని వేడికి ప్లాస్టిక్ కంటైనర్ హానికరమైన రసాయనాలను విడుదల చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్లాస్టిక్ వేడికి గురైనప్పుడు దానిలోని ఎండోక్రైన్ వ్యవస్థకు అంతరాయం కలిగి దాని నుండి రసాయనాలు వెలువడుతాయి. ఇక దీనిని ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్ అనే జర్నల్ లో ప్రచూరించిన పరిశోధనలో వెల్లడించడం జరిగింది. కావున మైక్రో వేవ్ సేఫ్ అని లేబుల్ ఉంచిన కంటైనర్లను మాత్రమే ఉపయోగించాలి.

గుడ్లు….

do-you-use-ovens-but-dont-actually-heat-these-things-in-it

చాలామంది త్వరగా గుడ్లను ఉడికించాలని ఉద్దేశంతో మైక్రో ఓవెన్ లో పెడుతుంటారు. కానీ ఈ పొరపాటు అసలు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే గుడ్లను మైక్రోవేవ్ లో ఉడికించడం వలన దాని లోపల టెంపరేచర్ విపరీతంగా పెరుగుతుంది. తద్వారా అవి వివిధ భాగాలుగా విడిపోవడం జరుగుతుంది. అలాగే ఎక్కువగా ఉడికించడం వలన ఎగ్స్ లో ఉండే పోషకాలు కూడా నశిస్తాయట.

స్టైరోఫోమ్ కంటైనర్లు…

do-you-use-ovens-but-dont-actually-heat-these-things-in-it

చాలామంది వీటిని మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఉంచడానికి వినియోగిస్తారు. అయితే కొందరు వీటిని మైక్రో ఓవెన్ లో కూడా ఉపయోగిస్తున్నారు. కానీ వీటిని మైక్రోవేవ్ లో అసలు ఉపయోగించకూడదు. ఎందుకంటే మైక్రోవేవ్ లో వీటిని ఉపయోగించడం వలన దాని నుండి వచ్చే వేడి ఈ కంటైనర్లను కరిగేలా చేస్తుంది. తద్వారా దాని నుండి హానికరమైన రసాయనాలు ఆహారంలో విడుదలవుతాయి. కావున ఈ కంటైనర్లను మైక్రో ఓవెన్ లో అసలు వినియోగించకూడదు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.