Tea-Coffee : పరిగడుపున టీ కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా..?

Tea-Coffee  : ప్రస్తుత కాలంలో చాలామంది టీ కాఫీల ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. అంతేకాక ఈ పానీయాలను తాగిన వెంటనే ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. సమయం సందర్భం లేకుండానే చాలామంది వీటిని తీసుకుంటూ ఉంటారు. అంతేకాక కాస్త అలసటగా అనిపించిన ,తలనొప్పి వచ్చిన , నలుగురు వ్యక్తులు కలిసిన కప్పు టీ లేదా కాఫీతో గొంతు తడపాల్సిందే. అయితే ఉదయాన్నే పరగడుపున వీటిని తీసుకోవడం పై ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. టీ లేదా కాఫీని […]

  • Published On:
Tea-Coffee : పరిగడుపున టీ కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా..?

Tea-Coffee  : ప్రస్తుత కాలంలో చాలామంది టీ కాఫీల ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. అంతేకాక ఈ పానీయాలను తాగిన వెంటనే ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. సమయం సందర్భం లేకుండానే చాలామంది వీటిని తీసుకుంటూ ఉంటారు. అంతేకాక కాస్త అలసటగా అనిపించిన ,తలనొప్పి వచ్చిన , నలుగురు వ్యక్తులు కలిసిన కప్పు టీ లేదా కాఫీతో గొంతు తడపాల్సిందే. అయితే ఉదయాన్నే పరగడుపున వీటిని తీసుకోవడం పై ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. టీ లేదా కాఫీని ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు. అందుకే పరిగడుపున టీ తాగేముందు ఓ చిన్న పని చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి అదేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

do-you-know-what-happens-if-you-drink-tea-and-coffee-in-the-morning
అయితే రాత్రి సమయంలో ఏం తినకుండా మరల ఉదయాన్నే ఎలాంటి ఆహారం తీసుకోకుండా టీ లేదా కాఫీ తాగడం వలన పేగులపై ప్రభావం పడుతుందట. దీని కారణంగా ఆకలి తగ్గడంతో పాటు , జీర్ణ క్రియ కూడా మందగిస్తుంది. అంతేకాక కడుపునొప్పి , గ్యాస్ సమస్యలు కూడా ఎదురవుతాయట. అయితే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వలన దానిలో ఉండే ఆసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇక ఇది శరీరంలోని అనేక రకాల సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక అల్సర్ క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా వస్తాయి. అలాగే ఇది దంతక్షయానికి కూడా దారితీస్తుందని చెప్పవచ్చు. కావున పరిగడుపుతో టీ లేదా కాఫీ లను తాగేముందు తప్పకుండా ఓ పని చేయడం మంచిదని నిపుణులుు సూచిస్తున్నారు.

do-you-know-what-happens-if-you-drink-tea-and-coffee-in-the-morning

అదేంటంటే టీ తాగేముందు కడుపునిండా నీళ్లు తాగడం. టీ లేదా కాఫీ తాగే ముందు కడుపునిండా నీళ్లు తాగడం వలన టీ లో ఉండే కెఫెన్ యొక్క ప్రభావం పేగులపై పడకుండా ఉంటుంది. తద్వారా కొంత మేరకు రిస్కు కూడా తగ్గుతుందని చెప్పవచ్చు. కావున ప్రతిరోజు పరిగడుపున టీ లేదా కాఫీ తాగే 15 నిమిషాల ముందు నీళ్లు తాగటం అలవాటు చేసుకోవడం మంచిది. అలా కాకుండా ఏదైనా ఆహారాలు తీసుకున్న తర్వాత వీటిని తీసుకున్నట్లయితే ఎలాంటి సమస్య ఉండదని నిపుణులు చెప్తున్నారు. ఇలా చేయడం వలన మీ శరీరం అనేక రకాల వ్యాధుల నుండి రక్షించబడుతుందని వైద్యులు తెలుపుతున్నారు. కావున అవకాశం ఉన్న మేరకు ఈ నియమాలను పాటించడానికి ప్రయత్నించండి.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికి సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.