Methi Seeds : ప్రతిరోజు మెంతు నీళ్లు తాగితే ఏమవుతుంది తెలుసా…

Methi Seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. అయితే మధుమేహం అనేది రక్తంలోని చక్కెర స్థాయిలను గుర్తించే ఆరోగ్య పరిస్థితి. ఇక ఈ డయాబెటిస్ లో అనేక రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ,గర్భధారణ మధుమేహం , ఫ్రీ డయాబెటిస్. ఇక ఈ సమస్యలను తగ్గించుకోవాలి అంటే రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించుకోవాలి. అయితే రక్తం లోని చక్కర స్థాయిలను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడే అనేక […]

  • Published On:
Methi Seeds : ప్రతిరోజు మెంతు నీళ్లు తాగితే ఏమవుతుంది తెలుసా…

Methi Seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. అయితే మధుమేహం అనేది రక్తంలోని చక్కెర స్థాయిలను గుర్తించే ఆరోగ్య పరిస్థితి. ఇక ఈ డయాబెటిస్ లో అనేక రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ,గర్భధారణ మధుమేహం , ఫ్రీ డయాబెటిస్. ఇక ఈ సమస్యలను తగ్గించుకోవాలి అంటే రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించుకోవాలి. అయితే రక్తం లోని చక్కర స్థాయిలను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడే అనేక రకాల సహజ పద్ధతులలో మెంతునీరు కూడా ఒకటి. ఈ క్రమంలోనే చాలామంది మెంతి నీరుని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటారు. మరి మెంతి నీటిని ప్రతిరోజు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.

ఇంటర్నేషనల్ జనరల్ ఫర్ విటమిన్ అండ్ న్యూట్రిషన్ రీసెర్చ్ నిర్వహించిన ఒక అధ్యాయనం ప్రకారం వేడి నీటిలో నానబెట్టిన 10 గ్రాముల మెంతులు ప్రతిరోజు తగిన మోతాదులో తీసుకోవడం వలన టైప్ టు డయాబెటిస్ ను నియంత్రించడానికి సహాయపడుతుందట. మధుమేహం ఉన్నవాళ్లు రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించే సామర్థ్యం మెంతుల నీటికి సమృద్ధిగా ఉందని వారి తెలియజేశారు. అలాగే ఇది ఫైబర్ కలిగి ఉంటుంది. జీర్ణక్రియ ప్రక్రియను మందగించడంలో కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది.

అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతి గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్పాలి. ఈ విత్తనాలలో ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి కార్బోహైడ్రేట్లను చక్కరను శరీర శోషణం చేస్తాయి. అయితే శరీరం చెక్కరను ఎలాగైతే వినియోగిస్తుందో అదేవిధంగా విడుదల అయిన ఇన్సులిన్ మొత్తాన్ని కూడా పెంచడంలో విత్తనాలు ఎంతగానో సహాయపడతాయి. అలాగే మరికొన్ని అధ్యయనాలు మెంతులు అనేక రకాల పరిస్థితులకు సమర్థవంతమైన చికిత్స అని కూడా చెబుతున్నాయి. అలాగే 2009 అధ్యాయంలో వేడినీటిలో నానబెట్టిన 10 గ్రాముల మెంతు గింజలను ప్రతిరోజు తీసుకోవడం వలన టైప్ టు డయాబెటిస్ నియంత్రించవచ్చని చెబుతున్నారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.