Guava Benifits : ప్రతిరోజు జామపండు తింటే కలిగే ప్రయోజనాలు తెలుసా…తెలిస్తే అసలు వదలరు…

Guava Benifits : ఈరోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా టైం కి తినాలి. అలాగే మీరు తీసుకునే ఆహారం కూడా ఆరోగ్యానికి మేలు చేసేది అయి ఉండాలి. అలాంటి హెల్త్ ఫుడ్స్ లో ముందు వరసలో ఎప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి. అయితే ఏ సీజనల్ ఫ్రూట్స్ ని ఆ సీజన్ లో తప్పకుండా తింటూ ఉంటారు. అయితే ఇప్పుడు జామ పండ్ల సీజన్ కాబట్టి మరి దీని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో వీటిలో దాగివున్న పోషకాలు […]

  • Published On:
Guava Benifits : ప్రతిరోజు జామపండు తింటే కలిగే ప్రయోజనాలు తెలుసా…తెలిస్తే అసలు వదలరు…

Guava Benifits : ఈరోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా టైం కి తినాలి. అలాగే మీరు తీసుకునే ఆహారం కూడా ఆరోగ్యానికి మేలు చేసేది అయి ఉండాలి. అలాంటి హెల్త్ ఫుడ్స్ లో ముందు వరసలో ఎప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి. అయితే ఏ సీజనల్ ఫ్రూట్స్ ని ఆ సీజన్ లో తప్పకుండా తింటూ ఉంటారు. అయితే ఇప్పుడు జామ పండ్ల సీజన్ కాబట్టి మరి దీని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో వీటిలో దాగివున్న పోషకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

do-you-know-the-benefits-of-eating-guava-every-day

జామ పండులో ఫైబర్ కంటెంట్ అధిక శాతం లో ఉంటుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచే కాంపౌండ్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే దీనిని సూపర్ ఫ్రూట్ గా పిలుస్తుంటారు. ఇక ఇది దంతాల ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు జామకాయ తినడం వలన చర్మం తో పాటు జుట్టు కళ్ళకి కూడా చాలా మేలు జరుగుతుందట. అలాగే హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ వంటి సమస్యలను అదుపులో ఉంచేందుకు జామ పండు చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే గుండె జబ్బుల నుండి కూడా రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

do-you-know-the-benefits-of-eating-guava-every-day

ఇక జామపండు లో ఉండే పొటాషియం గుండె జబ్బుల్ని దరిచేరనివ్వదు. అలాగే జామకాయలను ప్రతిరోజు తినడం వలన బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే జామపండును రోజు తినడం వలన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.బాడీలోని ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇక దీనిలో ఉండే మెగ్నీషియం కండరాలు మరియు నరాల నొప్పులను రిలాక్స్ చేసి నొప్పిని దూరం చేస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాలును తగ్గించేందుకు ఈ జామపండు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అలాగే గర్భవతి స్త్రీలు వీటిని తీసుకోవడం వలన పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.