Weight Loss : వాటర్ థెరపీ గురించి మీకు తెలుసా…? చాలా సులువుగా బరువు తగ్గిస్తుంది…

Weight Loss : ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో భాగంగా చాలామంది విపరీతమైన బరువును కలిగి ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే సమాజంలో చాలామంది జపిస్తున్న మంత్రం బరువు తగ్గాలి.. నాజుగ్గా తయారవ్వాలి. ఇక దీనికోసం ఎన్నో రకాల డైట్ ను వర్క్ అవుట్ ను ఫాలో అవుతూ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఎంత శ్రమించినప్పటికీ కొందరు మాత్రమే అనుకున్నది సాధించగలుగుతున్నారు. సగానికి సగం మంది వారి బరువును తగ్గించుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే కేవలం వాటర్ […]

 • Published On:
Weight Loss : వాటర్ థెరపీ గురించి మీకు తెలుసా…? చాలా సులువుగా బరువు తగ్గిస్తుంది…

Weight Loss : ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో భాగంగా చాలామంది విపరీతమైన బరువును కలిగి ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే సమాజంలో చాలామంది జపిస్తున్న మంత్రం బరువు తగ్గాలి.. నాజుగ్గా తయారవ్వాలి. ఇక దీనికోసం ఎన్నో రకాల డైట్ ను వర్క్ అవుట్ ను ఫాలో అవుతూ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఎంత శ్రమించినప్పటికీ కొందరు మాత్రమే అనుకున్నది సాధించగలుగుతున్నారు. సగానికి సగం మంది వారి బరువును తగ్గించుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే కేవలం వాటర్ తాగడం ద్వారా బరువు తగ్గించే థెరపీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా…? అవును మీరు వింటున్నది నిజమే…? మరి ఆ తెరపి ఏంటో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ థెరపీ పేరు జపనీస్ వాటర్ థెరపీ. అయితే జపాన్ కు చెందిన ప్రజలు పూర్వకాలం నుంచి బరువు నియంత్రించుకోవడానికి ఈ థెరపీ ను ఫాలో అవుతున్నారు. గోరువెచ్చని నీటి ద్వారా ఈ థెరపీ ని పాటిస్తారు. మరి ఈ థెరపీ ని ఎలా అనుకరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

do-you-know-about-water-therapy-lose-weight-very-easily

ఇలా చేయండి…

 • ఈ థెరపీ ని పాటించాలి అనుకునే వారు ప్రతి రోజు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నాలుగు నుండి ఐదు గ్లాసుల గోరువెచ్చని నీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
 • అలాగే టిఫిన్ చేయడానికి ముందు దాదాపు 40 నిమిషాల ముందు వాటర్ తాగాలి.
 • అదేవిధంగా భోజన సమయానికి 15 నిమిషాల ముందు మంచినీళ్లను తాగాలి.
 • అలాగే ఒకసారి ఆహారం తీసుకున్న తర్వాత మళ్లీ రెండు గంటల వరకు అసలు ఏమి తినకూడదు. చిరుతిండ్లు వంటి ఆహార పదార్థాలను కూడా అస్సలు తీసుకోకూడదు.
 • ఇక ఈ థెరపీలో ప్రతిరోజు ఉదయం నాలుగు గ్లాసుల నీరు తాగలేక పోతే ప్రతి గ్లాస్ కు కొంత సమయం ఇచ్చి తాగవచ్చు. అదేవిధంగా వయసు పైబడిన వారు ఈ తెరపిని మొదట ఒక గ్లాసు నుంచి మొదలు పెట్టడం మంచిది.
 • అలాగే ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలి.
 • అదేవిధంగా ప్రతిరోజు నిద్రించే ముందు గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసుకుని పుక్కిలించాలి. ఈ విధంగా చేయడం వలన ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. ఇక ఈ థెరపీలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే నిలబడి తినడం తాగటం వంటి పనులు అస్సలు చేయకూడదు.

ఈ థెరపీ ద్వారా పొందే ప్రయోజనాలు…

 • జపాన్లో తాజాగా నిర్వహించిన అధ్యయంనం ప్రకారం పగలు ఎక్కువగా నీటిని తాగడం వలన ఆకలి నియంత్రించి సులువుగా బరువు తగ్గుతున్నారు.
 • అదేవిధంగా ఈ థెరపీ స్వీట్ డ్రింక్స్ వంటి వాటిని దూరంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.
 • జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఈ థెరపీ సహాయపడుతుంది.
 • అదేవిధంగా మలబద్ధకాన్ని నివారించడం ,టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్, హైబీపీ వంటి సమస్యలకు ఇది మంచి ఔషధమని చెప్పాలి.
 • అయితే ఈ థెరపీ ద్వారా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు కచ్చితంగా గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే చన్నీళ్లతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వులని కరిగించడం కష్టం. కానీ గోరువెచ్చని నీటితో ఆ పని సాధ్యమవుతుంది. అందుకే ఈ థెరపీ ఉపయోగించాలి అనుకునే వారు కచ్చితంగా గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధృవీకరించలేదు.