Coconut Husk : కొబ్బరి పీచుతో ఎనలేని ప్రయోజనాలు…ఏంటో తెలిస్తే అసలు పడేయరు…

Coconut Husk  : కొబ్బరి వలన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలిసిందే. కానీ కొబ్బరి పీచు వలన కూడా బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయని మీలో ఎవరికైనా తెలుసా…?అవును ఇది నిజమే…చాలామంది కొబ్బరి పీచు ను పడేస్తుంటారు కానీ దాని వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు పడేయరని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి దాని ప్రయోజనాలు ఏంటో వివరాలేంటి ఇప్పుడు మనం తేలుసుకుందాం. ఆర్థరైటిస్… అర్థరైటిస్ సమస్యతో బాధపడే వారికి కొబ్బరి పీచు దివ్య […]

  • Published On:
Coconut Husk : కొబ్బరి పీచుతో ఎనలేని ప్రయోజనాలు…ఏంటో తెలిస్తే అసలు పడేయరు…

Coconut Husk  : కొబ్బరి వలన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలిసిందే. కానీ కొబ్బరి పీచు వలన కూడా బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయని మీలో ఎవరికైనా తెలుసా…?అవును ఇది నిజమే…చాలామంది కొబ్బరి పీచు ను పడేస్తుంటారు కానీ దాని వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు పడేయరని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి దాని ప్రయోజనాలు ఏంటో వివరాలేంటి ఇప్పుడు మనం తేలుసుకుందాం.

Countless benefits of coconut fiber.

ఆర్థరైటిస్…

అర్థరైటిస్ సమస్యతో బాధపడే వారికి కొబ్బరి పీచు దివ్య ఔషధమని చెప్పాలి. మీరు గనక అర్ధరైటిస్ నొప్పులతో బాధపడుతున్నట్లయితే కొబ్బరి పీచుతో టీ తయారు చేసుకుని తాగటం వలన త్వరగా ఉపశమనం పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ కొబ్బరి పీచులో ఉండే ఆంటీ ఇన్ఫ్లుమేటరీ గుణాలు అర్ధరైటిస్ నొప్పులకు చెక్ పెడతాయి.

దంతాలను శుభ్రం చేయడానికి…

ప్రస్తుత కాలంలో చాలామంది దంతాలు అనేవి పసుపుపచ్చగా మారుతున్నాయి. ఇక ఈ పసుపు పచ్చని పోగొట్టి తెల్లగా మిల మిల మెరవడానికి కొబ్బరి పీచు ఎంతగానో సహాయపడుతుంది. దీనికోసం మీరు కొబ్బరి పొట్టును ఒక గిన్నెలో వేసుకుని మంటపై ఫ్రై చేసుకోవాలి. ఇక అది నల్లగా మారిన తర్వాత దానిని పొడిలా చేసుకుని ఆ పొడిని దంతాల శుభ్రం చేయడానికి ఉపయోగించాలి. ఇలా చేసినట్లయితే అనతి కాలంలోనే దంతాలు తెల్లగా మెరుస్తాయి.

విరోచనాలు తగ్గిస్తుంది…

విరోచనాలు జీర్ణక్రియ సమస్యలు వంటి వాటితో బాధపడుతున్న వారికి కొబ్బరి పీచు అద్భుతంగా పనిచేస్తుంది. విరోచనాలతో బాధపడే వారు కొబ్బరి పీచుతో వాటర్ తాగితే ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ కొబ్బరి పీచు వాటర్ ను తయారు చేయడానికి ముందుగా కొబ్బరి పీచు శుభ్రంగా చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో ఈ కొబ్బరి పీచును వేసి బాగా ఉడికించుకోవాలి. అనంతరం దానిని ఫిల్టర్ చేసుకునే గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.