Dandruff : చుండ్రు సమస్య వేధిస్తోందా…అయితే ఇలా చేయండి…

Dandruff : ప్రతి ఒక్కరికి సాధారణంగా ఏదో ఒక సమయంలో చుండ్రు అనేది వస్తూ ఉంటుంది. మరిముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలామంది చుండ్రు సమస్య నివారణ కోసం చర్మవ్యాధి వైద్యులను ఆశ్రయిస్తుంటారు. వారిచ్చిన సలహాలు సూచనలు కూడా పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ సమస్య నుండి పూర్తిగా ఉపశమనం పొందలేరు. మరికొందరికి ఈ చుండ్రు సమస్య దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సీజన్ తో సంబంధం లేకుండా చుండ్రు అనేది వస్తూనే […]

  • Published On:
Dandruff : చుండ్రు సమస్య వేధిస్తోందా…అయితే ఇలా చేయండి…

Dandruff : ప్రతి ఒక్కరికి సాధారణంగా ఏదో ఒక సమయంలో చుండ్రు అనేది వస్తూ ఉంటుంది. మరిముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలామంది చుండ్రు సమస్య నివారణ కోసం చర్మవ్యాధి వైద్యులను ఆశ్రయిస్తుంటారు. వారిచ్చిన సలహాలు సూచనలు కూడా పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ సమస్య నుండి పూర్తిగా ఉపశమనం పొందలేరు. మరికొందరికి ఈ చుండ్రు సమస్య దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సీజన్ తో సంబంధం లేకుండా చుండ్రు అనేది వస్తూనే ఉంటుంది. అలాంటి వారి కోసమే మేము ఒక అద్భుతమైన చిట్కా ను తీసుకొచ్చాం. ఇక ఈ చిట్కాను ఇంట్లోనే తయారు చేసుకుని ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. ఇంతకీ ఆ చిట్కా ఏంటంటే…

are-you-suffering-from-dandruff-problem-but-do-this

దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో రెండు కప్పుల గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఆ తర్వాత అందులో రెండు స్పూన్స్ నిమ్మరసం నాలుగు స్పూన్స్ కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తలకు పట్టించాలి. అనంతరం ఓ వస్త్రం తీసుకుని తలకు చుట్టుకోవాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండు సమస్య ఈజీగా తగ్గుతుంది. ఇక ఈ చిట్కాను వారానికి 1 లేదా 2సార్లు ట్రై చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.