Plastic Cans : ప్లాస్టిక్ క్యాన్ లో నిల్వచేసిన నీటిని ఎక్కువగా తాగుతున్నారా…అయితే ఈ సమస్యలు తప్పవు…

Plastic Cans : ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఏమవుతుందిలే అయినప్పుడు చూసుకుందామని కొందరు ఈ మాటలను పెడచెవిన పెడుతూ ప్లాస్టిక్ వస్తువులను వాడుతూనే ఉన్నారు. అయితే ఆహార పదార్థాల మాట పక్కన పెడితే రోజు తాగే నీరు కూడా ప్లాస్టిక్ క్యాన్ లోనే తాగుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఆధునిక సాంకేతిక యుగంలో తాగునీటి అవసరాల కోసం 20 […]

  • Published On:
Plastic Cans : ప్లాస్టిక్ క్యాన్ లో నిల్వచేసిన నీటిని ఎక్కువగా తాగుతున్నారా…అయితే ఈ సమస్యలు తప్పవు…

Plastic Cans : ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఏమవుతుందిలే అయినప్పుడు చూసుకుందామని కొందరు ఈ మాటలను పెడచెవిన పెడుతూ ప్లాస్టిక్ వస్తువులను వాడుతూనే ఉన్నారు. అయితే ఆహార పదార్థాల మాట పక్కన పెడితే రోజు తాగే నీరు కూడా ప్లాస్టిక్ క్యాన్ లోనే తాగుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఆధునిక సాంకేతిక యుగంలో తాగునీటి అవసరాల కోసం 20 లీటర్లు క్యాన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇవి గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నారు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరు క్యాన్స్ లో నిలువ చేసుకున్న నీటినే తాగుతున్నారు.

are-you-drinking-a-lot-of-water-stored-in-a-plastic-can

అయితే ఇలా తాగటం అన్నది దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని కలిగించడమే కాక వీటి కారణంగా పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మనందరికీ తెలిసిందే ప్లాస్టిక్ దశాబ్దాలుగా విచ్చినం కాకుండా ఉంటుంది. అందుకే ఇది పర్యావరణానికి హానికరమని చెబుతుంటారు. అయితే నీటి నిల్వ కోసం ఉపయోగిస్తున్న ఈ కాన్స్ పాతవిగా అయిపోయిన తర్వాత వ్యర్ధాలుగా బయటపడేస్తున్నారు. తద్వారా ఇది కాలుష్యానికి కారణం అవుతుంది. అలాగే వాటర్ క్యాన్స్ లో ఎక్కువ సేపు నిలువ ఉంచిన నీటిని తాగితే శరీరానికి మరియు ఆరోగ్యానికి హాని కలిగించే దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

are-you-drinking-a-lot-of-water-stored-in-a-plastic-can

అలాగే ప్లాస్టిక్ నుండి వెలువడే రసాయనాలు అతిపెద్ద ముప్పుగా పరిగణిస్తున్నారు. కావున వీటిలో నిల్వచేసిన నీటిని తాగడం వలన నీటి ద్వారా ఈ రసాయనాలు శరీరంలోకి చేరి అక్కడి నుండి రక్తం లోకి ప్రవేశిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వాటర్ క్యాన్ ఎక్కువసేపు సూర్యరశ్మిలో ఉన్నప్పుడు ఈ రసాయనాలు విడుదలవుతాయి. అలాగే ఈ ప్లాస్టిక్ లో నిల్వచేసిన నీటిని తాగడం వలన రోగ నిరోధక శక్తి వ్యవస్థ కూడా దెబ్బతింటుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాక దీని కారణంగా మధుమేహం , ఊబకాయం ,సంతాన ఉత్పత్తి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కావున ప్లాస్టిక్ క్యాన్ లో నిల్వచేసిన నీటిని తాగటం మంచిది కాదు. దీనికి బదులుగా రాగి పాత్రలో నిలువ చేసిన నీటిని తాగటం ఉత్తమం.