Pitru Paksham 2023 : రేపటి నుంచి పితృపక్షం మొదలు .. పొరపాటున కూడా స్త్రీలు ఈ పనులు అస్సలు చేయకండి ..

Pitru Paksham 2023 : పూర్వీకుల ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటాం. అందుకోసం సంవత్సరంలో 15 రోజులు చనిపోయిన వారి కోసం పితృపక్షంగా కేటాయించారు. ఈ పితృపక్షాన్ని కొన్ని ప్రదేశాలలో ఒక పండుగలాగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది భాద్రపదం మాసంలోని శుక్లపక్షం పౌర్ణమి నాడు పితృపక్షం ప్రారంభం అవుతుంది. అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభమయి అక్టోబర్ 14న ముగుస్తుంది. అయితే ఈ 15 రోజులు పితృపక్షంలో మహిళలు పొరపాటున కూడా ఈ […]

  • Published On:
Pitru Paksham 2023 : రేపటి నుంచి పితృపక్షం మొదలు .. పొరపాటున కూడా స్త్రీలు ఈ పనులు అస్సలు చేయకండి ..

Pitru Paksham 2023 : పూర్వీకుల ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటాం. అందుకోసం సంవత్సరంలో 15 రోజులు చనిపోయిన వారి కోసం పితృపక్షంగా కేటాయించారు. ఈ పితృపక్షాన్ని కొన్ని ప్రదేశాలలో ఒక పండుగలాగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది భాద్రపదం మాసంలోని శుక్లపక్షం పౌర్ణమి నాడు పితృపక్షం ప్రారంభం అవుతుంది. అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభమయి అక్టోబర్ 14న ముగుస్తుంది. అయితే ఈ 15 రోజులు పితృపక్షంలో మహిళలు పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకూడదు.

vwomen-should-not-do-these-things-during-pithru-paksha

ఈ 15 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో, శ్రాద్ధ తర్పణం, పిండ దానం చేయాల్సి ఉంటుంది. పితృ దోష సమయంలో స్త్రీలు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనులు పూర్వీకులకు కోపాన్ని కూడా తొలగించవచ్చు. దీనివలన ఇంట్లో కొన్ని సమస్యలు రావచ్చు. పితృపక్షంలో రోజు ఉదయాన్నే లేచి పూజలు చేయాలి. ఆ తర్వాత పూర్వీకులను గుర్తు చేసుకొని దానధర్మాలు చేయాలి. ఇంటిపై వాలే కాకులు, ఇతర పక్షులు, జీవాలకు మీరు ఆహారం అందించాలి. మన పూర్వీకులు పక్షుల రూపంలో ఇంటికి వస్తారని నమ్మకం ఉంది.

women-should-not-do-these-things-during-pithru-paksha

పితృపక్ష కాలం పిడ దినాలుగా పరిగణిస్తారు. శుభకార్యాలకు పనికిరాదు. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పనులు ప్రారంభించకూడదు. పితృపక్ష సమయంలో కొత్త బట్టలు ఇతరత్రా వస్తువులు కొనుగోలు చేయకూడదు. అలాగే ఈ సమయంలో వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ వాడకాన్ని తగ్గించాలి. ఈ సమయంలో గోర్లు కత్తిరించడం, కటింగ్ చేయించుకోవడం, గడ్డం చేయించుకోవడం వంటివి చేయకూడదు. ఈ సమయంలో పండిన అరటిపండు, పెరుగు, తెల్లని స్వీటు, దక్షిణ రూపంలో ధనాన్ని దానం చేయాలి. స్త్రీలు రుతుక్రమంలో వంట చేయకూడదు. ఇంట్లో ఉండే మరో స్త్రీ తో వంట చేయించాలి. లేదంటే ఇంట్లో పురుషులు కూడా వండి వడ్డించవచ్చు.