Dharmasandehalu : ఏ రోజు గాజులు ధరించడం వలన భర్త ఆయుష్షు పెరుగుతుంది…ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన నిజాలు…

Dharmasandehalu : ఓ నిర్దిష్టమైన రోజులు ,సమయాలలో స్త్రీలు పొరపాటున కూడా గాజులు ధరించకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ విషయాన్ని సాక్షాత్తు శివపార్వతులే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి శివుడిని ఏరోజు గాజులను ధరించడం వలన స్త్రీ భర్త యొక్క ఆయుష్షు తగ్గిపోతుంది అని అడిగిందట. దీనికి బదులుగా శివుడు ఇలా సమాధానం ఇచ్చారట.వివాహం చేసుకున్న ప్రతి స్త్రీ కచ్చితంగా గాజులు ధరించాలి. అలాగే ఈ గాజులను ధరించే సమయంలో కొన్ని విషయాలపై ప్రత్యేక […]

  • Published On:
Dharmasandehalu : ఏ రోజు గాజులు ధరించడం వలన భర్త ఆయుష్షు పెరుగుతుంది…ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన నిజాలు…

Dharmasandehalu : ఓ నిర్దిష్టమైన రోజులు ,సమయాలలో స్త్రీలు పొరపాటున కూడా గాజులు ధరించకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ విషయాన్ని సాక్షాత్తు శివపార్వతులే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి శివుడిని ఏరోజు గాజులను ధరించడం వలన స్త్రీ భర్త యొక్క ఆయుష్షు తగ్గిపోతుంది అని అడిగిందట. దీనికి బదులుగా శివుడు ఇలా సమాధానం ఇచ్చారట.వివాహం చేసుకున్న ప్రతి స్త్రీ కచ్చితంగా గాజులు ధరించాలి. అలాగే ఈ గాజులను ధరించే సమయంలో కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.ఇక గాజులను ఎప్పుడూ ఉదయం లేదా సాయంత్రం సమయంలోనే ధరించాలి.

which-day-wearing-bangles-increases-husbands-life-span-facts-every-woman-should-know

అలాగే గాజులను శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే ధరించాల్సి ఉంటుంది. ఈ రెండు వారాలలో ధరించినట్లయితే భర్త యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది. ఇక మంగళవారం శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ గాజులను కొనకూడదు భరించకూడదు. ఈ వారాలలో గాజులను ధరించటం లేదా కొనడం వలన భర్త ఆయుష్షు తగ్గిపోతుందనేది శివుడి ఆజ్ఞ. అందుకే కొత్తగా గాజులను ధరించేవారు ఈ విషయాలపై దృష్టి పెట్టాలి. ఇది ఇలా ఉంటే స్త్రీ గాజులు ధరించడం వెనక సైన్స్ కూడా దాగి ఉంది. అయితే పూర్వం రోజుల్లో మగవాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉండేవారు.

ఇక ఆడవారు ఇంటికే పరిమితమై ఉండేవారు. అయితే ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఇంట్లోనే ఉండటం వలన మహిళలలో రక్తపోటు సమస్యలు ఎక్కువగా వస్తుండేవట. ఈ క్రమంలోనే అనారోగ్య సమస్యల బారిన పడకుండా స్త్రీలను రక్షించేందుకు మన పూర్వీకులు వారి చేతులకు గాజులు వేసే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. తద్వారా మణికట్టుపై ఉండే గాజులు శరీరానికి రాపిడి జరిపి యాక్టివ్ చేస్తాయి. ఇలా గాజులు ఒకదానికొకటి రాపిడి చేయడం వలన శరీరంలో రక్త ప్రసరణ కూడా చాలా బాగా జరుగుతుంది. తద్వారా మహిళలకు అనారోగ్య సమస్యలు రావడం కూడా సన్నగిల్లాయి. ఈ విధంగా పూర్వీకులు ఈ ఆచారాన్ని తీసుకొచ్చినట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.