Dharma Sandehalu : దేవునికి సమర్పించిన నైవేద్యానికి చీమలు పడితే ఏమవుతుంది…?ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నిజం…

Dharma Sandehalu  : మనం దేవుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని తరచూ చీమలు పట్టడం లేదా ప్రసాదాన్ని చీమలు తీసుకెళ్లడం చూస్తూ ఉంటాం. అయితే నైవేద్యాన్ని చీమలు ఇలా తినడం వలన ఇంట్లో ఏమైనా జరుగుతుందా అనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే ఇంట్లో చీమలు కనిపించడం కొన్ని సమయాలలో ఎంతో అదృష్టమని దీని కారణంగా ఆకస్మిక ధన లాభం కూడా కలుగుతుందని, లక్ష్మీదేవి కటాక్షం పొందుతారని పెద్దలు చెబుతున్నారు. అయితే చీమలలో ఎర్ర చీమలు […]

  • Published On:
Dharma Sandehalu  : దేవునికి సమర్పించిన నైవేద్యానికి చీమలు పడితే ఏమవుతుంది…?ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నిజం…

Dharma Sandehalu  : మనం దేవుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని తరచూ చీమలు పట్టడం లేదా ప్రసాదాన్ని చీమలు తీసుకెళ్లడం చూస్తూ ఉంటాం. అయితే నైవేద్యాన్ని చీమలు ఇలా తినడం వలన ఇంట్లో ఏమైనా జరుగుతుందా అనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే ఇంట్లో చీమలు కనిపించడం కొన్ని సమయాలలో ఎంతో అదృష్టమని దీని కారణంగా ఆకస్మిక ధన లాభం కూడా కలుగుతుందని, లక్ష్మీదేవి కటాక్షం పొందుతారని పెద్దలు చెబుతున్నారు. అయితే చీమలలో ఎర్ర చీమలు మాత్రం చెడుకు శకునిగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే చెడుకు సంకేతమని చెబుతుంటారు. అలాగే ఆహారాన్ని తీసుకెళ్తూ చీమలు కనిపిస్తే అది అదృష్టంగా భావిస్తారు. అయితే సాధారణంగా ప్రతి ఇంట్లో పూజ అనంతరం ప్రసాదాలను తీసుకుంటారు.

what-happens-if-ants-fall-on-the-offering-made-to-god-truth-everyone-should-know

అయితే కొన్నిసార్లు మిగిలిన ప్రసాదానికి లేదా దేవుడు వద్ద ఉంచిన ప్రసాదానికి చీమలు పడుతూ ఉంటాయి. అయితే ఇలా ప్రసాదాలకు చీమలు పట్టడం వలన ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు. ఎవరైతే ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారో వారు ఆ కష్టాల నుంచి తప్పకుండా బయటపడతారని , అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని నిపుణుల అంచనా. మెరుగైన జీవితం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ,ఆర్థిక కష్టాల నుండి బయటపడాలి అనుకునే వారికి , అలాగే అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందాలనుకునే వారు నైవేద్యాన్ని సమర్పించడం వలన వారి అనుకున్నవి జరుగుతాయని ప్రగాఢ నమ్మకం. అయితే దేవునికి నైవేద్యాన్ని పెట్టే సమయంలో మనసులో బలంగా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం.

what-happens-if-ants-fall-on-the-offering-made-to-god-truth-everyone-should-know

అయితే మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు సంకేతంగా దేవుడు ప్రకృతి ద్వారా చీమల రూపంలో వచ్చి ప్రసాదాలను స్వీకరిస్తాడని పురోహితులు చెబుతున్నారు. కావున దేవునికి సమర్పించిన నైవేద్యానికి చీమలు పట్టినట్లయితే సంకోచించాల్సిన పనిలేదు. ఇక ఇది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా భావించవచ్చు. ఇదిలా ఉంటే ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు పూజారి ప్రసాదం పెట్టిన వెంటనే చాలామంది వెంటనే తినేస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదట. పక్షులకు జంతువులకు చేతులు లేవు కాబట్టి అవి నేరుగా తింటాయి. కానీ మనకు దేవుడు రెండు చేతులు ఇచ్చాడు కదా. అందుకు కుడి చేతితో ప్రసాదాన్ని స్వీకరించి ఎడమ చేతికి మార్చుకొని కుడి చేతితో కొద్దికొద్దిగా తినాలి. అలాకాకుండా కుడి చేతితో తీసుకుని ఒకేసారి నోట్లో వేసుకుంటే మరుజన్మలో పక్షులై పుడతారని పురాణాలు చెబుతున్నాయి.

 

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధృవీకరించలేదు.