Unknown Facts : మనిషి చనిపోయిన తర్వాత అసలేం జరుగుతుంది…సైన్స్ చెబుతున్న నిజాలు…

Unknown Facts  : ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. అయితే మనిషి చనిపోయే ముందు ఆ వ్యక్తులలో కొన్ని లక్షణాలను గమనించవచ్చని సైన్స్ చెబుతోంది. ఇక ఈ మరణం సంభవించే ముందు ప్రతి జీవిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. మనుషులలో అయితే నోటి అంగలి తడి ఆరిపోతున్నట్లు అనిపించడం , శరీరం ఎడమ భాగం చిట్లిపోతున్నట్లుగా అనిపించడం, ముక్కు కొన భాగం కనిపించకపోవడం వంటివి మరణ సంకేతాలుగా కొందరు చెబుతున్నారు. […]

  • Published On:
Unknown Facts : మనిషి చనిపోయిన తర్వాత అసలేం జరుగుతుంది…సైన్స్ చెబుతున్న నిజాలు…

Unknown Facts  : ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. అయితే మనిషి చనిపోయే ముందు ఆ వ్యక్తులలో కొన్ని లక్షణాలను గమనించవచ్చని సైన్స్ చెబుతోంది. ఇక ఈ మరణం సంభవించే ముందు ప్రతి జీవిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. మనుషులలో అయితే నోటి అంగలి తడి ఆరిపోతున్నట్లు అనిపించడం , శరీరం ఎడమ భాగం చిట్లిపోతున్నట్లుగా అనిపించడం, ముక్కు కొన భాగం కనిపించకపోవడం వంటివి మరణ సంకేతాలుగా కొందరు చెబుతున్నారు. ఇక ఈ సమయంలోనే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుందని నిర్ధారిస్తున్నారు. అలాగే మనిషి జన్మించే సమయంలో నీడతో పాటు పుడతాడు.ఇక మరణించే సమయంలో ఆ నీడ కూడా వెళ్ళిపోతుందట.

what-actually-happens-after-the-death-of-a-man-the-truths-of-science

అలాగే మనిషి తన ప్రతిబింబాన్ని నీటిలో లేదా నూనెలో చూసుకోలేకపోతే కూడా అది మరణానికి సంకేతం అని కొందరు భావిస్తుంటారు. అయితే ఇందు పురాణాల ప్రకారం కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు కనిపిస్తే చనిపోయిన వారు స్వర్గానికి వెళ్తారని కూడా నమ్ముతారు. శ్రీకృష్ణుడి భగవద్గీతలో చెప్పిన సారాంశాల ప్రకారం శరీరంలో 9 ప్రధాన ద్వారాలు ఉంటాయట. ఎవరైతే వారి జీవితంలో పుణ్యాలు చేస్తారో వారు శరీరం యొక్క ఎగువ ద్వారాల నుండి ఆత్మ బయటికి వెళుతుందట. ఎగువ భాగాలు అనగా కళ్ళు ముక్కు నోరు చెవులు. జీవితంలో మంచి పనులు చేసేవారు చెడు తలపెట్టని వాళ్లు గొప్ప వ్యక్తులుగా కీర్తించబడి ,వారి ఆత్మలు ఎగువ ద్వారాల నుండి బయటకు వెళ్తాయని నమ్మకం.

what-actually-happens-after-the-death-of-a-man-the-truths-of-science

ఇక మరణించే సమయంలో ఆత్మ ముక్కు ద్వారా బయటికి వస్తే ఆ ముక్కు కాస్త వంకరగా మారుతుంది. కళ్ళనుండి బయటకు వచ్చినట్లయితే చనిపోయిన తర్వాత కళ్ళు మూసుకోరు. చెవి నుండి బయటకు వచ్చినట్లయితే చెవి కాస్త పైకి లాగినట్లు కనిపిస్తుందని భగవద్గీత చెబుతోంది. అలాగే చనిపోయిన తర్వాత పురస్కారాలు , శిక్షలు కూడా అనుభవిస్తారని భూమిపై చేసిన తప్పులకు ఫలితం అనుభవించక తప్పదని చెబుతుంది. అలాగే మనిషి చనిపోయిన తర్వాత మూడు నిమిషాల పాటు వారి చుట్టూ ఏం జరుగుతుందో చనిపోయిన వారికి కూడా తెలుస్తుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి.

గమనిక : పైన పేర్కొనబడిన కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే…ఇది ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడంం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.