LunarEclipse-2023 : ఈరోజే చిట్టచివరి చంద్రగ్రహణం…ఘడియలు ఇవే…

LunarEclipse-2023 : సాధారణంగా అయితే సంవత్సరంలో నాలుగు నుండి ఆరుసార్లు గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇక ఈ ఏడాదిలో చిట్టచివరి గ్రహణం అక్టోబర్ 28న సంభవిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే 2023 సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు రాగా వాటిలో రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి.అయితే మొదటిగా ఏప్రిల్ 20న సూర్యగ్రహణం ఏర్పడగా ఇది జరిగిన రెండు వారాలకే మే 5న చంద్రగ్రహణం ఏర్పడింది. ఇక ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. శరత్ […]

  • Published On:
LunarEclipse-2023 : ఈరోజే చిట్టచివరి చంద్రగ్రహణం…ఘడియలు ఇవే…

LunarEclipse-2023 : సాధారణంగా అయితే సంవత్సరంలో నాలుగు నుండి ఆరుసార్లు గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇక ఈ ఏడాదిలో చిట్టచివరి గ్రహణం అక్టోబర్ 28న సంభవిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే 2023 సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు రాగా వాటిలో రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి.అయితే మొదటిగా ఏప్రిల్ 20న సూర్యగ్రహణం ఏర్పడగా ఇది జరిగిన రెండు వారాలకే మే 5న చంద్రగ్రహణం ఏర్పడింది. ఇక ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. శరత్ పౌర్ణమి రోజున పాక్షిక చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 28న అర్ధరాత్రి 1: 05 నిమిషాలకు ప్రారంభమై ఆదివారం తేల్లవారుజామున 2:24 నిమిషాలకు ముగియనున్నట్లు తెలుస్తోంది.దాదాపు 20 నుండి 30 నిమిషాల పాటు ఈ గ్రహణం ఏర్పడనున్నట్లు సమాచారం.

today-is-the-last-lunar-eclipse-these-are-the-clocks

అయితే ఈ పాక్షిక చంద్ర గ్రహణం కేవలం భారతదేశం లోనేే కాకుండా నేపాల్, శ్రీలంక, భూటాన్ ,మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, జర్మనీ, చైనా ,ఇరాన్ ,పోలాండ్ , టర్కీ నైజీరియా బ్రిటన్ మలేషియా , స్వీడన్, థాయిలాండ్ ఆస్ట్రేలియా, జపాన్ ,ఇండోనేషియా , ఉత్తర కొరియా, దక్షిణ కొరియా బ్రెజిల్ , వంటి దేశాల్లో కూడా కనిపించనుంది. ఖగోళ నిపుణులు అందిస్తున్న సమాచారం ప్రకారం మొత్తం 16 దేశాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుందని అంచనా. ఇక ఈ సమయంలో చంద్రుడి నుండి వచ్చే కిరణాలు అమృతాన్ని చిమ్ముతున్నట్లుగా కనిపిస్తాయట. అయితే ఇలాంటి చంద్రగ్రహణం దాదాపు తొమ్మిదేళ్ల కిందట ఏర్పడిందని తర్వాత మళ్లీ ఈరోజు ఏర్పడబోతుందని ఖగోళ శాస్త్ర నిపుణులు చెప్పుకొస్తున్నారు. అయితే గ్రహణం అనేది భూమి చంద్రుడు సూర్యుడు ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు ఏర్పడుతుంటాయి.

today-is-the-last-lunar-eclipse-these-are-the-clocks

అంతేకాక చంద్రుడు కంటే భూమి చాలా పెద్దగా ఉండటం వలన సూర్యగ్రహణం కంటే కూడా చంద్రగ్రహణాన్ని ప్రపంచంలో చాలా దేశాలు వీక్షించే అవకాశం ఉంటుంది. అలాగే చంద్రగ్రహణం ఏర్పడుతున్న సందర్భంగా భారతదేశంలోని పలు ఆలయాలను మూసి వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం మూసి వేయబడుతుంది. ఇక గ్రహణం అనంతరం ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సంప్రోక్షణ జరిపించి ఆలయ తలుపులను తెరుస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం తో పాటు శ్రీశైలం, భ్రమరాంబ మల్లికార్జున స్వామి ,కాణిపాకం , శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం , సింహాచలం నరసింహస్వామి ఆలయాలు కూడా మూసి వేయడం జరిగింది. దాదాపు 8 గంటల పాటు ఈ ఆలయాలు మూసివేసి ఉంచుతారని సమాచారం.