Mahalaya Amavasya : ఈరోజు మహాలయ అమావాస్య….కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయకపోతే ఇక అంతే…

Mahalaya Amavasya  : ఈ ఏడాది అక్టోబర్ 14న మహాలయ అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది.ఈ క్రమంలో అమావాస్యనాడు కొడుకులు ఉన్నవారు కొన్ని పరిహారాలను చేయాల్సిందిగా పండితులు చెబుతున్నారు. ఇక ఈ పరిహారం చేయనట్లయితే గ్రహణం అనంతరం వచ్చేటువంటి చెడు ప్రభావాలు కొడుకులు ఉన్నటు వంటి కుటుంబాలపై పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కావున ఈ పరిహారం చేసిన్నట్లయితే అన్ని రకాలుగా అనుకూలమైన కాలం నడుస్తుందని చెబుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ప్రయత్నించే పనులన్నీ […]

  • Published On:
Mahalaya Amavasya  : ఈరోజు మహాలయ అమావాస్య….కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయకపోతే ఇక అంతే…

Mahalaya Amavasya  : ఈ ఏడాది అక్టోబర్ 14న మహాలయ అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది.ఈ క్రమంలో అమావాస్యనాడు కొడుకులు ఉన్నవారు కొన్ని పరిహారాలను చేయాల్సిందిగా పండితులు చెబుతున్నారు. ఇక ఈ పరిహారం చేయనట్లయితే గ్రహణం అనంతరం వచ్చేటువంటి చెడు ప్రభావాలు కొడుకులు ఉన్నటు వంటి కుటుంబాలపై పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కావున ఈ పరిహారం చేసిన్నట్లయితే అన్ని రకాలుగా అనుకూలమైన కాలం నడుస్తుందని చెబుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ప్రయత్నించే పనులన్నీ సానుకూల పలితాలుగా మారుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. మానసిక ప్రశాంతత పెరిగి అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడతారు.

those-who-have-sons-must-do-this-on-mahalaya-amavasya-day

చిన్న చిన్న ఇబ్బందులు తొలగి జీవితంలో సరికొత్త ఉత్సాహం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రా నిపుణులు తేలియజేస్తున్నారు. అంతేకాక ఈ అమావాస్య పితృదేవతల రుణం తీర్చుకోవడానికి కూడా ప్రాధానమైనదిగా చెబుతున్నారు. అలాగే మహాభారతంలో ఈ అమావాస్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది.కావున ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ అమావాస్య ప్రాధాన్యత తెలుసుకొని పూజా విధానాలు పాటిస్తే జీవితంలో ఉన్నటువంటి కష్టాలు పితృ దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక ఈ మహాలయ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకుని అనంతరం ఉపవాస దీక్షను చేపట్టాలి. అలాగే ఈరోజు సూర్య భగవానుడిని ఆరాధిస్తూ కుటుంబానికి రాబోయే నష్టాల నుంచి ఉపశమనం కలిగించమని వేడుకోవాలి. అలాగే పూజ సమయంలో సూర్యాష్టకం కచ్చితంగా చదవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఒకవేళ తల్లి కొడుకు వేరువేరు ప్రాంతాల్లో ఉన్నట్లయితే తల్లి సూర్యాష్టకం చదివే సమయం లోనే కొడుకు కూడా సూర్యాష్టకం చదువుకునేలాగా చూసుకోవాలట. అలాగే ఈ సూర్యాష్టకం చదివేటప్పుడు పసుపు కుంకుమలతో కలిపినటువంటి అక్షంతలను కచ్చితంగా ఉపయోగించాలి. అలాగే పూజ అనంతరం ఈ అక్షింతలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీరు డబ్బును ఎక్కువగా ఎక్కడైతే పెడతారో అక్కడ ఈ వస్త్రాన్ని ఉంచి తిరిగి అమావాస్య వచ్చేంతవరకు ఉండనివ్వాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా ధన లాభం కలుగుతుందని నమ్మకం. అయితే ఈరోజు ఎవరైతే దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడిపి ఈ పరిహారాన్ని పాటిస్తారో వారు ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారని వారికి రానున్న రోజుల్లో అనుకూలమైన కాలం వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు.

గమనిక : పైన పేర్కొనబడిన అంశాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.