Solar Eclipse 2023 : కొద్ది రోజుల్లో ఏర్పడనున్న తొలి సూర్యగ్రహణం…ఈ ఐదు రాశుల వారికి ఇక్కట్లు తప్పవు…

Solar Eclipse 2023 : జ్యోతిష్య శాస్త్రం మరియు పంచాంగంలో కొన్ని గ్రహాల యుతిని అత్యంత శుభప్రదంగా భావిస్తారు.అయితే ఏప్రిల్ 20న తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఇక ఇది మేషరాశిలోని అశ్విని నక్షత్రంలో ప్రవేశించనుంది. అయితే మంగళ గ్రహం మిధునరాశిలో లేదా బుద్దుడు మేషరాశిలో ఉంటే అశుభంగా పరిగణిస్తారు. మంగళ మరియు బుధ గ్రహాలు వేరువేరు రాశులలో ఉండటం వలన పరివర్తన యోగం ఏర్పడుతుందట. దీని వలన అదే రోజు గ్రహాల ప్రత్యేక సంయోగం కూడా ఏర్పడబోతోంది. […]

  • Published On:
Solar Eclipse 2023 : కొద్ది రోజుల్లో ఏర్పడనున్న తొలి సూర్యగ్రహణం…ఈ ఐదు రాశుల వారికి ఇక్కట్లు తప్పవు…

Solar Eclipse 2023 : జ్యోతిష్య శాస్త్రం మరియు పంచాంగంలో కొన్ని గ్రహాల యుతిని అత్యంత శుభప్రదంగా భావిస్తారు.అయితే ఏప్రిల్ 20న తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఇక ఇది మేషరాశిలోని అశ్విని నక్షత్రంలో ప్రవేశించనుంది. అయితే మంగళ గ్రహం మిధునరాశిలో లేదా బుద్దుడు మేషరాశిలో ఉంటే అశుభంగా పరిగణిస్తారు. మంగళ మరియు బుధ గ్రహాలు వేరువేరు రాశులలో ఉండటం వలన పరివర్తన యోగం ఏర్పడుతుందట. దీని వలన అదే రోజు గ్రహాల ప్రత్యేక సంయోగం కూడా ఏర్పడబోతోంది. అయితే దీనివల్ల కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఎదురవుతాయి. మరి ఆ రాశుల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

the-first-solar-eclipse-that-will-take-place-in-a-few-days-these-five-zodiac-signs-will-be-in-trouble

తులారాశి..

ఈ రాశి వారికి పనిచేసే చోట మార్పులు ఏర్పడతాయి. వ్యాపార భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఏవైనా పెట్టుబడి పనులకు ఇది సరైన సమయం కాదు. పూర్వీకుల సంపదలలో లాభాలను గడిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పై ఎక్కువ శ్రద్ధ చూపించాలి.

the-first-solar-eclipse-that-will-take-place-in-a-few-days-these-five-zodiac-signs-will-be-in-trouble

వృషభ రాశి…

ఈ రాశి వారు ఊహించినట్లు అస్సలు జరగవు. చేసే పనిని ఆత్మవిశ్వాసంతో చేస్తే ఫలితాలు ఉంటాయి. ముందు ముందే భవిష్యత్తు గురించి ఆందోళన చెందకూడదు. భవిష్యత్తు విషయంలో గొడవలు జరిగే అవకాశం ఉన్నాయి. పెట్టుబడి పనులకు దూరంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.

the-first-solar-eclipse-that-will-take-place-in-a-few-days-these-five-zodiac-signs-will-be-in-trouble

మకర రాశి..

తొలి సూర్య గ్రహణం వలన ఈ రాశి వారు అనారోగ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కర్తవ్యం నిర్వహించాల్సిన చోట బద్ధకంగా ఉంటారు. అయితే ఈ రాశి వారు యోగా చేయడం ద్వారా వీటిని దూరం చేసుకోవచ్చు.

the-first-solar-eclipse-that-will-take-place-in-a-few-days-these-five-zodiac-signs-will-be-in-trouble

 

మేష రాశి…

ఈ సమయంలో ఈ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. చట్టపరమైన కేసులలో ఇరుక్కునే అవకాశం ఉంది. వ్యాపారాలలో నష్టం వస్తుంది. పెట్టుబడి ఆలోచన విరమించుకోవాలి. బంధాలు దెబ్బతింటాయి. దుబారా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఖర్చు పెట్టే విషయంలో ఆలోచించి ఖర్చు పెట్టాలి.

the-first-solar-eclipse-that-will-take-place-in-a-few-days-these-five-zodiac-signs-will-be-in-trouble

కన్యారాశి…

సూర్య గ్రహణం సమయంలో ఈ రాశుల వారు మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంలో ఒడిదుడుకులు ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య తగాదాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. చాలా అప్రమత్తంగా ఉండాలి.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ప్రజల విశ్వాసాలు మరియు ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.