Sculptor Arun Yogiraj : రాములల్లా పూర్తిగా మారిపోయాడు ఇది నేను చేయలేదు…

Sculptor Arun Yogiraj : ప్రముఖ శిల్పి అరుణ్ యోగి రాజ్ అయోధ్యలో ప్రతిష్టించిన రామ్ లల్లా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తాను రూపొందించిన విగ్రహం ప్రతిష్టించిన తర్వాత మరొక రకంగా కనిపించింది అంటూ అని పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ట తరువాత శ్రీరాముడు మరో రూపాన్ని సంతరించుకున్నారని తెలిపారు. రామ్ లల్లా ను నేను 7 నెలల పాటు రూపొందించాను. కాని ప్రతిష్టించిన తర్వాత అదే రాములల్లాను గుర్తించలేకపోయాను అని తెలిపారు. గర్భగుడిలోకి అడుగు […]

  • Published On:
Sculptor Arun Yogiraj : రాములల్లా పూర్తిగా మారిపోయాడు ఇది నేను చేయలేదు…

Sculptor Arun Yogiraj : ప్రముఖ శిల్పి అరుణ్ యోగి రాజ్ అయోధ్యలో ప్రతిష్టించిన రామ్ లల్లా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తాను రూపొందించిన విగ్రహం ప్రతిష్టించిన తర్వాత మరొక రకంగా కనిపించింది అంటూ అని పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ట తరువాత శ్రీరాముడు మరో రూపాన్ని సంతరించుకున్నారని తెలిపారు. రామ్ లల్లా ను నేను 7 నెలల పాటు రూపొందించాను. కాని ప్రతిష్టించిన తర్వాత అదే రాములల్లాను గుర్తించలేకపోయాను అని తెలిపారు. గర్భగుడిలోకి అడుగు పెట్టాక రామ్ లల్లా విగ్రహంలో చాలా మార్పులు వచ్చాయని ఆ విగ్రహంలోని ప్రకాశం మరోలా ఉందని చెప్పుకొచ్చారు. రామ్ లల్లాను గర్భగుడిలో ప్రతిష్టించిన తర్వాత రాముడు పూర్తిగా మారిపోయాడు.

sculptor-arun-yogiraj-comments-about-ram-lalla-statue

రాముడు విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు నాకు ఒక రకంగాను ప్రాణ ప్రతిష్ట తర్వాత మరో రకంగాను కనిపించాడు.ఇది నేను ఆశ్చర్యానికి గురయ్యాను. ఇది నా పని కాదని నేను భావించాను. ఇది ఈశ్వరుడి చమత్కారము లేక మరేమో తెలియదు కానీ ఇది నిజంగా అద్భుతం అని అరుణ్యోగిరాజు పేర్కొన్నాడు. ఎన్నో ఏళ్ల పూర్వికుల తపస్సు కారణంగానే తాను ఈ పనికి ఎంపిక అయ్యాను అని తన భావాలను మాటల్లో వర్ణించలేనని అన్నారు. రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేసేందుకు తన కి ఏడు నెలల సమయం పట్టింది అన్నారు. ఆ ఏడు నెలల కాలం తనకి ఛాలెంజ్ గా అనిపించిందని తెలిపారు.

ఇదే సమయంలో అరుణ్యోగిరాజ్ ఒక ఆసక్తికరమైన కథను కూడా పంచుకున్నారు. తాను రాములల్లా విగ్రహాన్ని రూపొందించే సమయంలో బూతాలు వచ్చేవి అని అప్పుడు పనిని కొనసాగించడం కాస్త ఇబ్బందిగా అనిపించేది అని అన్నారు. ఆ బూతాల నుండి తప్పించుకోవడం కోసం తాము ద్వారాలు ఫిక్స్ చేశామని అయినప్పటికీ ఆ బూతాలు విడిచిపెట్టలేదని అవి అక్కడికి వచ్చి తలుపులు కొట్టేవి అని అన్నారు. తాము ఆ తలుపులు తెరిచే దాకా అవి కొడుతూనే ఉంటాయని చెప్పారు. చివరికి తాను తలుపులు తీస్తే ఆ విగ్రహాన్ని చూసి వెళ్ళిపోయాయి అని అన్నారు. ఇక డిసెంబర్ 29వ తేదీన ప్రతిష్టకు తన విగ్రహాన్ని ఫైనల్ చేశారని దానితో తాను తుది మెరుగును దిద్ది సమయానికి పూర్తి చేశామని వెల్లడించారు.