SriSailam :శ్రీశైలం మల్లికార్జున పుణ్యక్షేత్రంలో అపచారం..పులిహోర ప్రసాదంలో చికెన్ బొక్కలు…
SriSailam : మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో అపచారం చోటుచేసుకుంది.ప్రస్తుతం శ్రీశైలం భక్తులు ఇదే మాట చెబుతున్నారు. అయితే ఇటీవల శ్రీశైలం వచ్చిన ఓ భక్తుడు శివయ్య దర్శనం అనంతరం ఆలయంలోని పులిహోర ప్రసాదం కొనుగోలు చేశాడు. ఇక అక్కడే ఆ పులిహోర ప్రసాదాన్ని తింటుండగా దాంట్లో నుండి చికెన్ ఎముక వచ్చింది. అయితే ఎంతో నిష్టగా తయారు చేసే ఈ పులిహోర ప్రసాదంలో మాంసం ఎముక రావడం కలకలం రేపుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే… […]
SriSailam : మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో అపచారం చోటుచేసుకుంది.ప్రస్తుతం శ్రీశైలం భక్తులు ఇదే మాట చెబుతున్నారు. అయితే ఇటీవల శ్రీశైలం వచ్చిన ఓ భక్తుడు శివయ్య దర్శనం అనంతరం ఆలయంలోని పులిహోర ప్రసాదం కొనుగోలు చేశాడు. ఇక అక్కడే ఆ పులిహోర ప్రసాదాన్ని తింటుండగా దాంట్లో నుండి చికెన్ ఎముక వచ్చింది. అయితే ఎంతో నిష్టగా తయారు చేసే ఈ పులిహోర ప్రసాదంలో మాంసం ఎముక రావడం కలకలం రేపుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే…
ఇటీవల శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం పరిధిలోని అమ్మవారి ఆలయం వెనుక బ్రహ్మానందరాయ గోపురం వద్ద ప్రసాదాల పంపిణీ నిర్వహించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ప్రసాదం స్వీకరించిన భక్తుడు హరీష్ రెడ్డికి పులిహోరలో మాంసం ఎముకలు కనిపించాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భక్తుడు హరీష్ రెడ్డి దేవస్థానం అధికారులకు లిఖితపూర్వకంగా ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈ అపచారం ఏంటని సదరు భక్తుడు ఆలయ అధికారులను ప్రశ్నించాడు.
ఇలాంటి అపచార ఘటనల వలన పుణ్యక్షేత్రాలలో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రసాదంలో మాంసపు ఎముక వచ్చిందంటూ భక్తుడు ,
కంప్లైంట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భక్తులు శ్రీశైలం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఇలాంటి సంఘటన జరగటం నిజంగా చాలా పెద్ద అపచారం అంటూ వారు తెలియజేస్తున్నారు.