Khairtabad Ganesh : మొదలైన ఖైరతాబాద్  మహాగణపతి శోభయాత్ర…..

Khairtabad Ganesh : భాగ్యనగరంలో గణేశుని నవరాత్రి ఉత్సవాలు అంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. నగరంలో వీధి వీధిన ఎన్నో విగ్రహాలు ప్రతిష్టించినప్పటికీ ఖైరతాబాద్ మహాగణపతికి ఉన్న ఆకర్షణ వేరు. ఇక ఈ మహాగణపతిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. అంతేకాక ఖైరతాబాద్ మహా గణపయ్యకి 7 దశాబ్దల చరిత్ర ఉంది. అందుకేే దేశంలోనే ఎక్కడా లేని విధంగా గణపయ్య వేడుకలు ఖైరతాబాద్ లో ఆకాశాన్ని అంటుతాయి… అయితే ఇటీవల గణేష్ నవరాత్రులు […]

  • Published On:
Khairtabad Ganesh : మొదలైన ఖైరతాబాద్  మహాగణపతి శోభయాత్ర…..

Khairtabad Ganesh : భాగ్యనగరంలో గణేశుని నవరాత్రి ఉత్సవాలు అంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. నగరంలో వీధి వీధిన ఎన్నో విగ్రహాలు ప్రతిష్టించినప్పటికీ ఖైరతాబాద్ మహాగణపతికి ఉన్న ఆకర్షణ వేరు. ఇక ఈ మహాగణపతిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. అంతేకాక ఖైరతాబాద్ మహా గణపయ్యకి 7 దశాబ్దల చరిత్ర ఉంది. అందుకేే దేశంలోనే ఎక్కడా లేని విధంగా గణపయ్య వేడుకలు ఖైరతాబాద్ లో ఆకాశాన్ని అంటుతాయి… అయితే ఇటీవల గణేష్ నవరాత్రులు ముగియడంతో ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర ప్రారంభమైంది.  63 అడుగుల ఎత్తులో శ్రీ దశమహావిద్య గణపతిగా దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణపయ్య శోభయాత్రకు సర్వం సిద్ధం చేశారు.

khairatabad-mahaganapati-shobhayatra

ఇక ఈరోజు ఉదయం 7 గంటలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కాగా…టెలిఫోన్ భవన్ , సచివాలయం మీదుగా గణేష్ ని శోభయాత్ర కొనసాగనుంది. ఈరోజు ఉదయం 9:30 నిమిషాలకు ఎన్టీఆర్ పార్క్ వద్దకు , మరియు 10:30 నిమిషాలకు క్రేన్ నెంబర్ 4 వద్ద పూజ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక ఈరోజు ఉదయం 11:30 నిమిషాలకు గణపయ్య నిమజ్జనం జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 12:00 దాటిలోపే నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిచేయనున్నారు. మహాగణపతి నిమజ్జనం నేపథ్యంలో శోభయాత్ర మార్గంలో జిహెచ్ఎంసి భారీ ఏర్పాట్లను చేసింది.

khairatabad-mahaganapati-shobhayatra

అయితే ఇదే రోజు ఖైరతాబాద్ మహాగణపతి తో పాటు 50 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం జరగనుందని అంచనా. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ తో పాటు పలు చెరువులు , రబ్బర్ డామ్స్ , ప్రత్యేక నీటి వనరులను , ఏర్పాటు చేశారు. ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ 5 చోట్ల 36 భారీ క్రేన్ లను ఏర్పాటు చేశారు. అంతేకాక 20 వేల సీసీ కెమెరాలతో భద్రత బలగాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. అంతేకాక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2,694 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. నిమజ్జన వేడుకలను చూసేందుకు భక్తులు భారీ స్థాయిలో తరలివస్తారు కాబట్టి ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఉండే విధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ భద్రతను చేపట్టింది.