Vastu shastra : మీ ఇంట్లో ఇలాంటి పక్షులను పెంచుకుంటే అదృష్టం పట్టినట్లే….

Vastu shastra : వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు నియమాలను అనుసరించి ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నప్పటికీ ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ ఇంట్లో అనుకూల వాతావరణం ఉండదని చెప్పాలి. దీని కారణంగా ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగించేందుకు అలాగే ఇంటికి అనుకూల వాతావరణ తీసుకొచ్చేందుకు వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలను సూచించడం జరిగింది. మరి అవేంటో […]

  • Published On:
Vastu shastra : మీ ఇంట్లో ఇలాంటి పక్షులను పెంచుకుంటే అదృష్టం పట్టినట్లే….

Vastu shastra : వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు నియమాలను అనుసరించి ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నప్పటికీ ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ ఇంట్లో అనుకూల వాతావరణం ఉండదని చెప్పాలి. దీని కారణంగా ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగించేందుకు అలాగే ఇంటికి అనుకూల వాతావరణ తీసుకొచ్చేందుకు వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలను సూచించడం జరిగింది. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

if-you-keep-such-birds-in-your-house-its-like-luck
అయితే చాలామందికి వారి ఇంట్లో జంతువులను పక్షులను పెంచుకోవడం ఇష్టం. ప్రస్తుత కాలంలో చాలామంది వారితో పాటు పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. ఇక వాటిని ఇంట్లో సభ్యుల్లా భావిస్తూ చాలా బాగా చూసుకుంటున్నారు. అదేవిధంగా కొందరు చిలుకలను పెంచుకుంటూ ఇంట్లో చిలుక తిరుగుతూ దాని పలుకులు వింటుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే చిలుకను పెంచుకోవడం అనేది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంచిదట. చిలుక ఇంట్లో ఉండటం వలన సానుకూల శక్తి లభిస్తుందని నమ్మకం. అయితే ఇంట్లో చిలుకను పెంచుకునేవారు కొన్ని నియమాలను పాటించాలని , అలాగే దాని పంజరాన్ని నిర్ణిత దిశలోనే ఉంచాలని శాస్త్రం చెబుతోంది.

if-you-keep-such-birds-in-your-house-its-like-luck

అలాగే కొంత మంది చిలుకలను పెంచుకోకుండా వాటి చిత్రపటాలను ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఇవి కూడా ఇంట్లోనే ప్రతికూల శక్తిని ఆకర్షించి సానుకూల శక్తిని పెంచుతాయి. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సామరస్య ధోరణి మరియు సంతోషం శ్రేయస్సు కొనసాగాలంటే ఈ చిలుకల చిత్రపటాలు ఇంట్లో పెట్టుకోవడం శుభసూచకం. అయితే ఈ చిలుక చిత్రాలను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన వాస్తు దిశగా పెట్టాలి. ఇక ఇది ఇంట్లో కుటుంబ సభ్యులపై సానుకూల ప్రభావాలను చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ చిత్రపటాన్ని సరైన దిశలో పెట్టనట్లయితే కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడడం , వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఎక్కువ ఆటంకాలు ఏర్పడటం వంటివి జరుగుతుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. కావున ఈ చిత్రపటాలను సరైనదిశగా పెట్టుకోవడం మంచిది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.