Astro Tips : ఇంట్లో ఇలాంటి పువ్వు ఉంటే డబ్బుకు కొదవ ఉండదట..సమస్యలన్నీ తొలగుతాయి..

Astro Tips  : హిందూమతంలో తులసి చెట్టుతో పాటు అనేక రకాల చెట్లను మొక్కలను చాలా ప్రత్యేకమైనవిగా పరిగణిస్తారు.ఈ చెట్లను మొక్కలను ప్రత్యేక సందర్భాలలో పూజిస్తుంటారు. అలాగే దేవతలకు ప్రీతికరమైన పూలతో పూజ చేసి ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగించే చాలా రకాల పువ్వులు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలోనే అపరాజిత పుష్పం ఒకటి. ఈ అపరానిత పుష్పాలను విష్ణు మరియు శివునికి చాలా ప్రీతికరమైనవిగా భావిస్తారు. ఇంట్లో అపరాజిత మొక్కను నాటిన లేదా వాటి పువ్వులను శ్రీహరి […]

  • Published On:
Astro Tips : ఇంట్లో ఇలాంటి పువ్వు ఉంటే డబ్బుకు కొదవ ఉండదట..సమస్యలన్నీ తొలగుతాయి..

Astro Tips  : హిందూమతంలో తులసి చెట్టుతో పాటు అనేక రకాల చెట్లను మొక్కలను చాలా ప్రత్యేకమైనవిగా పరిగణిస్తారు.ఈ చెట్లను మొక్కలను ప్రత్యేక సందర్భాలలో పూజిస్తుంటారు. అలాగే దేవతలకు ప్రీతికరమైన పూలతో పూజ చేసి ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగించే చాలా రకాల పువ్వులు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలోనే అపరాజిత పుష్పం ఒకటి. ఈ అపరానిత పుష్పాలను విష్ణు మరియు శివునికి చాలా ప్రీతికరమైనవిగా భావిస్తారు. ఇంట్లో అపరాజిత మొక్కను నాటిన లేదా వాటి పువ్వులను శ్రీహరి ,శివుడికి సమర్పించిన జీవితంలో ఆనందంతో పాటు శ్రేయస్సు లభిస్తుందని ప్రజల నమ్మకం. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో అపరాజిత పువ్వులలో బ్లూ కలర్ పువ్వులపై రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా చెప్పబడతాయి.

if-there-is-a-flower-like-this-in-the-house-there-will-be-no-shortage-of-money-all-the-problems-will-be-removed

అయితే ఆర్థిక సంక్షోభంతో బాగా ఇబ్బంది పడేవారు , ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సరిపడ డబ్బు రావడం లేదు అనుకునేవారు సోమవారం రోజున అపరాధిత పుష్పం తో ఈ పరిహారం చేయండి. దీనికోసం సోమవారం రోజున ఉపవాసం ఉండి శివలింగాన్ని పూజించాలి.అలాగే అపరాజిత పుష్పాలను దేవునికి సమర్పించడం మరియు రుద్రాక్షిజపమాలతో మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. తర్వాత దేవునికి సమర్పించిన అపరాజిత పుష్పాలలో ఒకదానిని ఎంచుకొని ఇంట్లో సంపదను నిలువ చేసే స్థానంలో ఉంచండి. దీనివలన ఆర్థిక సంక్షోభం తగ్గి డబ్బు ప్రవాహం వేగంగా పెరుగుతుందట.

if-there-is-a-flower-like-this-in-the-house-there-will-be-no-shortage-of-money-all-the-problems-will-be-removed

అంతేకాక మీరు ఉద్యోగ ఇంటర్వ్యూల కోసం వెళ్తున్నట్లయితే … దానికి ఒక రోజు ముందు 5 అపరాజిత పుష్పాలను తీసుకుని, వాటిని చేతిలో పెట్టుకుని మీ యొక్క అధిష్టాన దేవతను ప్రార్థించండి. అలాగే ఇంటర్వ్యూ కి వెళ్లేటప్పుడు ఈ పువ్వులను మీతో పాటు ఉంచుకోవడం విజయాన్ని అందిస్తుంది. వీటితోపాటుు సోమవారం లేదా శనివారం అపరాజిత పుష్పాలను ప్రవహించే నీటిలో వేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వలన జాతకంలో ఉండే అనేక గ్రహ సమస్యలు తొలగి ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ప్రజల విశ్వాసాలు మరియు ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.