Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయ ఆహ్వాన పత్రిక చూశారా…మీ జన్మ ధన్యం అవుతుంది…
Ayodhya Ram Mandir : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నది అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవం కోసం. అయితే కొన్ని దశాబ్దాల నుంచి ఎంతోమంది హిందువులు ఆతృతగా ఎదురుచూస్తున్న శుభ సమయం మరికొన్ని రోజుల్లో ఆసన్నమవుతుంది. మరి కొన్ని రోజుల్లో కోదండ రాముడు తన జన్మభూమి అయిన అయోధ్యలో కొలువుదీరనున్నాడు. ఈ మహత్తర కార్యం కోసం దేశ ప్రజలంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాక రాముని దర్శన భాగ్యం ఎప్పుడు దక్కుతుందంటూ కోట్లాదిమంది భక్తులు వేచి చూస్తున్నారు. […]
Ayodhya Ram Mandir : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నది అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవం కోసం. అయితే కొన్ని దశాబ్దాల నుంచి ఎంతోమంది హిందువులు ఆతృతగా ఎదురుచూస్తున్న శుభ సమయం మరికొన్ని రోజుల్లో ఆసన్నమవుతుంది. మరి కొన్ని రోజుల్లో కోదండ రాముడు తన జన్మభూమి అయిన అయోధ్యలో కొలువుదీరనున్నాడు. ఈ మహత్తర కార్యం కోసం దేశ ప్రజలంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాక రాముని దర్శన భాగ్యం ఎప్పుడు దక్కుతుందంటూ కోట్లాదిమంది భక్తులు వేచి చూస్తున్నారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఈనెల 22 నా అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే వేదమంత్రాలు నడుమ అత్యంత వైభవంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఆలయ ట్రస్టు దేశంలోని పలువురు ముఖ్యమైన వ్యక్తులకు ఆహ్వానాలు పంపించింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా అయోధ్య రామ మందిరం వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రిక వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రామాలయ ఉత్సవాలకు సంబంధించిన పలు విశేషాలను బయటపెడుతూ, ఆలయ ట్రస్ట్ చాలామంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపించడం జరిగింది. అయితే తాజాగా ఈ ఆహ్వాన పత్రికకు సంబంధించిన వీడియోను జాతీయ దూరదర్శన్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడం జరిగింది. ఇక ఆ కార్డు మొదటి పేజీలో న్యూ గ్రాండ్ టెంపుల్ హోమ్ లో రామ్ లల్ల తన జన్మస్థానానికి తిరిగి వస్తున్నందుకు శుభ వేడుక అంటూ అదేవిధంగా నిర్మాణానికి సంబంధించిన కాలక్రమం దశల వివరాల గురించి ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.
ఇక అయోధ్య రామాలయంలో గర్భగుడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు సంక్రాంతి పండుగ తర్వాత నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం. అదేవిధంగా జనవరి 16న సరయు నది నీటితో రామమందిరాన్ని శుద్ధి చేయనున్నారు. అనంతరం జనవరి 22వ తేదీన మధ్యాహ్నం బాలరామ విగ్రహ ప్రతిష్టలు నిర్వహిస్తారు. ఇక ఈ కార్యక్రమంలో దాదాపు 6,000 ఆహ్వానకార్డులను ప్రముఖులకు ఆహ్వానంగా పంపించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వేడుకలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం చీఫ్ మోహన్ భగవత్ , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , కేంద్ర హోం మంత్రి అమిత్ షా , యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్ తదితరులు హాజరు కానున్నారు. అయితే ఆ అయోధ్య రామ మందిరం ఆహ్వాన పత్రిక కింది వీడియోలో వీక్షించవచ్చు. మరి ఈ ఆహ్వాన పత్రిక పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
हरि अनन्त हरि कथा अनन्ता।
कहहि सुनहि बहुविधि सब संता।।#RamJanmbhoomiMandir की #PranPratishtha का भव्य निमंत्रण पत्र। #RamMandir | #Ayodhya pic.twitter.com/CJslFXicYM— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) January 3, 2024