Sabarimala : అయ్యప్ప భక్తులకు శుభవార్త…దర్శన సమయాన్ని పొడగించిన దేవస్థానం..

Sabarimala : ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో శబరిమల అయ్యప్ప దర్శనాలు కొనసాగుతున్నాయి. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతుండడంతో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న దర్శన సమయాన్ని మరో గంట పొడిగించినట్లుగా ప్రకటించడం జరిగింది . అయితే ఇప్పటివరకు 4:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు భక్తులు అయ్యప్ప […]

  • Published On:
Sabarimala : అయ్యప్ప భక్తులకు శుభవార్త…దర్శన సమయాన్ని పొడగించిన దేవస్థానం..

Sabarimala : ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో శబరిమల అయ్యప్ప దర్శనాలు కొనసాగుతున్నాయి. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతుండడంతో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న దర్శన సమయాన్ని మరో గంట పొడిగించినట్లుగా ప్రకటించడం జరిగింది . అయితే ఇప్పటివరకు 4:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు భక్తులు అయ్యప్ప స్వామిని దర్శిస్తుండగా , ఇప్పటినుండి మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభించి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగించాల్సిందిగా నిర్ణయం తీసుకున్నారు.

good-news-for-ayyappa-devotees-the-temple-extended-the-darshan-time

అయితే దర్శనాలను ఒక గంట ముందుగా ప్రారంభించడం వలన భక్తులందరికీ స్వామివారి దర్శనం కలుగుతుందని , ట్రావెన్ కోర్ దేవస్థానం పేర్కొంది. అలాగే భక్తుల రద్దీ కూడా కాస్త తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అయితే ప్రతిరోజు వర్చువల్ క్యూ ద్వారా 90 వేల బుకింగ్స్ , స్పాట్ లో 30 వేల బుకింగ్స్ ఉంటున్నాయని ఐజి సర్జన్ కుమార్ తెలియజేశారు. అదేవిధంగా మహిళలు వృద్ధులు చిన్నారులు పెద్ద సంఖ్యలో రావడంతో దర్శనాలకు కాస్త ఆటంకం ఏర్పడుతుందని తెలియజేశారు. అయితే దర్శన సమయాన్ని ప్రతిరోజు ఏడు గంటలకు మించి పొడిగించడం సాధ్యం కాదని, కానీ దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం అన్ని రకాలుగా ఏర్పాటు చేసినట్లు దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది.

అదేవిధంగా క్యూలో వేచి ఉంటున్న భక్తులకు మంచినీరు, బిస్కెట్లు అందించే ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలియజేశారు. ఇది ఇలా ఉండగా శబరిమల కొండపై జరిగిన తొక్కిసలాటలో 11 ఏళ్ల బాలిక మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. దేశ నలుమూలల నుండి అయ్యప్ప దర్శనానికి అయ్యప్ప భక్తులు వేలాది సంఖ్యలో తరలి వస్తుండడంతో క్యూలైన్లలో జరిగిన తొక్కిసలాటలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక క్యూ లైన్ లో దర్శనం కోసం వేచి చూస్తున్న బాలిక స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను వెంటనే పంపా ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించినట్లుగా తెలుస్తోంది.