No Entry To Women : భారతదేశంలో స్త్రీలకు అనుమతులేని దేవాలయాలు ఎన్ని ఉన్నాయో తెలుసా…

No Entry To Women : హిందూ సనాతన ధర్మం ప్రకారం ప్రకృతిలో పురుషుడు మరియు స్త్రీ సమానమే. అయితే దీనిలో ప్రకృతిని స్త్రీగా భావిస్తారు. అదేవిధంగా దైవంగా కొలుస్తారు. అలాగే దేవుడు ముందు పేద ధనిక , స్త్రీ పురుష భేదం లేదని అందరూ సమానమేనని ప్రగాఢమైన విశ్వాసం. అదే సమయంలో పూజ విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మరి ముఖ్యంగా స్త్రీలు రుతుక్రమం వచ్చిన సమయంలో పూజ చేయకూడదని అదేవిధంగా ఆలయాలకు కూడా […]

  • Published On:
No Entry To Women : భారతదేశంలో స్త్రీలకు అనుమతులేని దేవాలయాలు ఎన్ని ఉన్నాయో తెలుసా…

No Entry To Women : హిందూ సనాతన ధర్మం ప్రకారం ప్రకృతిలో పురుషుడు మరియు స్త్రీ సమానమే. అయితే దీనిలో ప్రకృతిని స్త్రీగా భావిస్తారు. అదేవిధంగా దైవంగా కొలుస్తారు. అలాగే దేవుడు ముందు పేద ధనిక , స్త్రీ పురుష భేదం లేదని అందరూ సమానమేనని ప్రగాఢమైన విశ్వాసం. అదే సమయంలో పూజ విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మరి ముఖ్యంగా స్త్రీలు రుతుక్రమం వచ్చిన సమయంలో పూజ చేయకూడదని అదేవిధంగా ఆలయాలకు కూడా వెళ్లకూడదని బలమైన నియమం ఒకటి ఉంది. ఈ ఒక్క సమయంలో తప్ప మిగిలిన రోజుల్లో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా దేవాలయాలకు వెళ్లి పూజా కార్యక్రమాలను నిర్వహించవచ్చు. అయితే మన దేశంలోని కొన్ని దేవాలయాలలో స్త్రీలకు ప్రవేశం లేదన్న విషయం మీకు తెలుసా..మరీ ముఖ్యంగా రుతుక్రమం వచ్చే వయసులో కొన్ని ఆలయాలకు స్త్రీలను అసలు అనుమతించరు. అయితే కేరళలోని అయ్యప్ప ఆలయం మాత్రమే కాకుండా దేశంలో మహిళలకు ప్రవేశం లేని ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. మరి అలాంటి దేవాలయల గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కేరళలోని పద్మనాభ స్వామి ఆలయం…

do-you-know-how-many-temples-are-there-in-india-where-women-are-not-allowed

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ప్రసిద్ధి చెందిన విష్ణు దేవాలయం పద్మనాభ స్వామి ఆలయం. మన భారతదేశంలోని ప్రధాన వైష్ణవ దేవాలయాలలో ఇది కూడా ఒకటి అని చెప్పాలి. అయితే ఈ ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ప్రసిద్ధిగాంచిన ఆలయం. అయితే ఈ ఆలయం ముఖ్యంగా శ్రీ విష్ణు భక్తులకు ప్రధాన పూజ స్థలమని చెప్పాలి. ఎందుకంటే విష్ణువు యొక్క విగ్రహం మొట్ట మొదట వెలుగులోకి వచ్చింది ఈ ప్రదేశంలోనే. దీంతో ఆ స్థలంలోనే శ్రీ పద్మనాభ స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఈ ఆలయంలోకి మహిళలు ప్రవేశించడం తరతరాలుగా వస్తున్న నిషేధం. అంతేకాక ఈ దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి.

శబరిమల అయ్యప్ప…

do-you-know-how-many-temples-are-there-in-india-where-women-are-not-allowed

కేరళలో అత్యంత పురాతనమైన ప్రసిద్ధిగాంచిన దేవాలయాలలో శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ఒకటి. ఇక ఈ అయ్యప్ప ఆలయానికి కేరళ రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇక ఈ ఆలయానికి 10 నుండి 50 సంవత్సరాల మధ్య గల మహిళలకు ప్రవేశం ఉండదు.

రాజస్థాన్ లోని కార్తికేయ దేవాలయం…

do-you-know-how-many-temples-are-there-in-india-where-women-are-not-allowed

రాజస్థాన్ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పుష్కర్ లో బ్రహ్మ దేవుని ఆలయం ఒకటి ఉంది. ఇక ఈ ఆలయం ప్రఖ్యాతిగాంచిన ఆలయాలలో ఒకటి. అదేవిధంగా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కార్తికే ఆలయం కూడా చూడదగిన ప్రదేశం. అయితే ఈ ఆలయంలోకి మహిళలకు ప్రవేశం ఉండదు.

మావాళి దేవి ఆలయం….

ఈ ఆలయం చతిస్ ఘడ్ లో ప్రసిద్ధ దేవాలయం. అయితే ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయం ప్రకారం ఆలయంలోకి మహిళలను అసలు అనుమతించరు. అయితే స్త్రీలు అమ్మవారిని ఆలయం బయట నుండి సందర్శించవచ్చు. దాదాపు 400 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో కేవలం పురుషులను మాత్రమే అనుమతించడం విశేషం.

శని సింగనాపూర్ ఆలయం…

do-you-know-how-many-temples-are-there-in-india-where-women-are-not-allowed

మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉన్న శని సింగనాపూర్ దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. అయితే ఈ ఆలయంలో కూడా మహిళలు లోపలికి వెళ్లి దర్శనం చేసుకోకూడదు. బయట నుంచి దర్శనం చేసుకునే విధంగా అనుమతి ఉంటుంది. అయితే ఈ సాంప్రదాయాన్ని విరమించి స్త్రీలను కూడా గుడిలోకి అనుమతి ఇవ్వమని చాలా మంది ర్యాలీ కూడా చేపట్టారు. కానీ ఆలయ సిబ్బంది మాత్రం దీనికి ససమేరా ఒప్పుకోలేదు. దీంతో ఈ సాంప్రదాయం ఇప్పటికి అలాగే కొనసాగుతూ వస్తుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికి సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధృవీకరించలేదు.